అన్వేషించండి

ఒక్క చార్జ్‌తో వందల కిలోమీటర్ల ప్రయాణం - రూ.15 లక్షల లోపే బ్రహ్మాండమైన ఎలక్ట్రిక్‌ కార్లు

మన మార్కెట్‌లో రూ.15 లక్షల లోపు కొనగలిగే 8 ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే. టాటా, ఎంజీ, మహీంద్రా కంపెనీల కార్లు మంచి రేంజ్‌, ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Electric Cars Under 15 Lakh 2026: మన దేశంలో, కొన్నేళ్ల క్రితం వరకు, ఎలక్ట్రిక్‌ కార్లు అంటే ఖరీదైనవి, రేంజ్‌ తక్కువ అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మంచి డిజైన్‌, ఆధునిక ఫీచర్లు, ఎక్కువ రేంజ్‌తో పాటు మధ్య తరగతి ప్రజలు కూడా కొనగలిగే ధరల్లోనే ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.15 లక్షలలోపు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ధరలో కొనగలిగే చాలా ఎలక్ట్రిక్‌ కార్లు ఉన్నాయి. ముఖ్యంగా టాటా కంపెనీ ఈ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చూపిస్తోంది. ఈ ధర పరిధిలో అందుబాటులో ఉన్న 8 ఎలక్ట్రిక్‌ కార్ల జాబితా ఇది:

8. MG Windsor EV

ఎంజీ కంపెనీ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్‌ కారు MG విండ్సర్‌ EV. 2025లో ఎక్కువగా అమ్ముడైన ఎలక్ట్రిక్‌ కార్లలో ఇది ఒకటి.

ఈ కారులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.

38kWh బ్యాటరీ - సుమారు 332 km రేంజ్‌

52.9kWh బ్యాటరీ - సుమారు 449 km రేంజ్‌

ఇందులో 136 hp మోటార్‌ ఉంటుంది. విశాలమైన కేబిన్‌, కంఫర్ట్‌ డ్రైవింగ్‌ అనుభవం ఈ కారుకు పెద్ద ప్లస్‌.

7. Mahindra XUV 3XO EV

మహీంద్రా నుంచి వచ్చిన బడ్జెట్‌ ఎలక్ట్రిక్‌ SUVలలో XUV 3XO EV ఒకటి. ఇది కంపెనీ పెట్రోల్‌ మోడల్‌ అయిన XUV 3XO ఆధారంగా తయారైంది.

ఇందులో 39.4kWh బ్యాటరీ ఉంటుంది.

పవర్‌ - 110 hp నుంచి 150 hp వరకు

రేంజ్‌ - సుమారు 350 km

నిజ జీవితంలో సుమారు 270 నుంచి 300 km వరకు రేంజ్‌ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది.

6. Citroen eC3

ఫ్రాన్స్‌కు చెందిన సిట్రోయెన్‌ కంపెనీ భారతదేశంలో అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్‌ కారు eC3.

29.2kWh బ్యాటరీ

57 hp మోటార్‌

ఈ కారు 246 km వరకు రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే ఇతర కార్లతో పోలిస్తే ఫీచర్లు కొంత తక్కువగా ఉంటాయి.

5. Tata Nexon EV

టాటా బ్రాండ్‌లో అత్యంత విజయవంతమైన ఎలక్ట్రిక్‌ SUVలలో నెక్సాన్‌ EV ఒకటి.

ఇది రెండు వేరియంట్లలో వస్తుంది.

MR (30kWh బ్యాటరీ) - సుమారు 275 km రేంజ్‌

45 (45kWh బ్యాటరీ) - సుమారు 489 km రేంజ్‌

ఈ సెగ్మెంట్‌లో బలమైన పనితీరు, మంచి రేంజ్‌, ఫీచర్లతో కూడిన ఇంటీరియర్‌ ఉండటం ఈ కారుకు పెద్ద ప్లస్‌.

4. Tata Tigor EV

ఈ జాబితాలో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్‌ సెడాన్‌ టాటా టిగోర్‌ EV.

ఇందులో

26kWh బ్యాటరీ

75 hp మోటార్‌

ఈ కారు 315 km వరకు రేంజ్‌ ఇస్తుంది. రేంజ్‌ పరంగా బాగానే ఉన్నప్పటికీ, ఫీచర్ల విషయంలో కొంత సాధారణంగా ఉంటుంది.

3. Tata Punch EV

భారతదేశంలో అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్‌ SUVలలో టాటా పంచ్‌ EV చాలా పాపులర్‌.

ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.

30kWh బ్యాటరీ - సుమారు 375 km రేంజ్‌

40kWh బ్యాటరీ - సుమారు 468 km రేంజ్‌

మంచి పనితీరు, కంఫర్ట్‌ రైడ్‌, ఫీచర్లతో కూడిన ఇంటీరియర్‌ ఈ కారును మంచి ఎంపికగా నిలబెడుతుంది.

2. Tata Tiago EV

టాటా కంపెనీ అందిస్తున్న అత్యంత చవకైన నాలుగు డోర్ల ఎలక్ట్రిక్‌ హ్యాచ్‌బ్యాక్‌ టియాగో EV.

ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.

19.2kWh బ్యాటరీ - 223 km రేంజ్‌

24kWh బ్యాటరీ - 293 km రేంజ్‌

10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌, మంచి ఇంటీరియర్‌, నగరాల్లో డ్రైవింగ్‌కు అనుకూలమైన సైజ్‌ ఈ కారుకు మంచి ప్లస్‌.

1. MG Comet EV

భారతదేశంలో ప్రస్తుతం అత్యంత చవకైన ఎలక్ట్రిక్‌ కారు MG కామెట్‌ EV.

ఇందులో

17.3kWh బ్యాటరీ

42 hp మోటార్‌

ఈ కారు 230 km వరకు రేంజ్‌ ఇస్తుంది. చిన్న సైజ్‌, ప్రత్యేకమైన డిజైన్‌ వల్ల ఇది నగరాల్లో ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మొత్తంగా చూస్తే ,రూ.15 లక్షలలోపు ఎలక్ట్రిక్‌ కార్లు ఇప్పుడు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా టాటా కంపెనీ ఈ సెగ్మెంట్‌లో నాలుగు మోడళ్లతో ముందుంది. పెట్రోల్‌ ఖర్చును వదిలించుకోవాలని భావించే వారికి ఇవి మంచి ఎంపికలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget