అన్వేషించండి

Tata Tiago EV ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌కు రెడీ అవుతోంది - సరికొత్త డిజైన్‌, పెద్ద బ్యాటరీతో వస్తోందా?

టాటా టియాగో ఎలక్ట్రిక్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ టెస్టింగ్‌లో కనిపించింది. కొత్త హెడ్‌ల్యాంప్స్‌, బంపర్‌, కనెక్టెడ్‌ టెయిల్‌ల్యాంప్స్‌తో పాటు పెద్ద బ్యాటరీ ఆప్షన్‌ వచ్చే అవకాశం ఉంది.

Tata Tiago EV Facelift Details In Telugu: ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్‌ కోసం టాటా మోటార్స్‌ మరో కీలక అప్‌డేట్‌కు సిద్ధమవుతోంది. కంపెనీకి మంచి అమ్మకాలు తెచ్చిపెట్టిన టాటా టియాగో ఎలక్ట్రిక్‌ ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో రావడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ కారు టెస్టింగ్‌ సమయంలో రోడ్లపై కనిపించడంతో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి.

టెస్టింగ్‌లో కనిపించిన మోడల్‌ను పూర్తిగా కేమోఫ్లాజ్‌తో కప్పి ఉంచినప్పటికీ, ఇందులో డిజైన్‌ పరంగా కొన్ని పెద్ద మార్పులు ఉండబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ముందు భాగంలో కొత్త లుక్‌ ఇవ్వడానికి టాటా బాగానే పని పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

ముందు భాగంలో కొత్త డిజైన్‌

స్పై ఫోటోల ప్రకారం, టియాగో ఎలక్ట్రిక్‌ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త హెడ్‌ల్యాంప్స్‌, కొత్త బంపర్‌, కొత్త గ్రిల్‌ కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుత మోడల్‌లో DRLs బంపర్‌లో ఉంటే, కొత్త మోడల్‌లో అవి హెడ్‌ల్యాంప్స్‌ లోపలే షార్ప్‌ స్టైల్‌లో ఉండేలా డిజైన్‌ చేసినట్టు తెలుస్తోంది.

హెడ్‌ల్యాంప్స్‌ కూడా మరింత షార్ప్‌గా, అగ్రెసివ్‌గా కనిపించేలా కొత్త ఇంటర్నల్‌ డిజైన్‌తో రావొచ్చు. అలాగే ముందు బంపర్‌ కూడా క్లీనర్‌గా, సింపుల్‌గా ఉండేలా రూపొందించినట్టు కనిపిస్తోంది. ఇది కేవలం స్టైల్‌కే కాకుండా ఏరోడైనమిక్‌ పనితీరు మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.

సైడ్‌, రియర్‌ డిజైన్‌లో మార్పులు

సైడ్‌ ప్రొఫైల్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, కొత్త అలాయ్‌ వీల్స్‌ డిజైన్‌ వచ్చే అవకాశం ఉంది. ఇవి కారుకు మరింత ప్రీమియం లుక్‌ ఇవ్వవచ్చు.

రియర్‌ భాగంలో మాత్రం ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. కొత్త మోడల్‌లో కనెక్టెడ్‌ టెయిల్‌ల్యాంప్స్‌ డిజైన్‌ ఉండే అవకాశం ఉంది. టెయిల్‌గేట్‌పై కనిపించిన డిజైన్‌ వివరాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. అదనంగా రియర్‌ బంపర్‌ కూడా కొత్తగా ఉండవచ్చు. టెయిల్‌ల్యాంప్స్‌ లోపలి డిజైన్‌ కూడా మార్చే అవకాశం ఉంది.

ఇంటీరియర్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు

2025లో టాటా టియాగో ఎలక్ట్రిక్‌ ఇప్పటికే ఇంటీరియర్‌ పరంగా పెద్ద అప్‌డేట్‌ తీసుకొచ్చింది. అందుకే ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో లోపల పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

అయితే ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ మాత్రం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత మోడల్‌లో చాలా సాధారణమైన డ్రైవర్‌ డిస్‌ప్లే ఉంటుంది. కొత్త మోడల్‌లో డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే ఇవ్వవచ్చని అంచనా.

పెద్ద బ్యాటరీ వచ్చే అవకాశం

టాటా మోటార్స్‌ ఇటీవల టాటా పంచ్‌ ఎలక్ట్రిక్‌లో కొన్ని మెకానికల్‌ అప్‌డేట్స్‌ ఇచ్చింది. అదే విధంగా టియాగో ఎలక్ట్రిక్‌లో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.

కొత్త 6-ఇన్-1 ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ట్రైన్‌ టెక్నాలజీను టాటా ఈ కారులో కూడా ఉపయోగించవచ్చు. ఇది ఎక్కువ సామర్థ్యం, మెరుగైన ప్యాకేజింగ్‌, తక్కువ తయారీ ఖర్చుతో ప్రయోజనం కలిగిస్తుంది.

ఇప్పుడు ఉన్న టియాగో ఎలక్ట్రిక్‌ రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది.

19.2kWh బ్యాటరీ - సుమారు 223 km రేంజ్‌

24kWh బ్యాటరీ – సుమారు 293 km రేంజ్‌

ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో ఇంకా పెద్ద బ్యాటరీ ఆప్షన్‌ వచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్‌ రంగంలో చర్చ జరుగుతోంది. అలా జరిగితే రేంజ్‌ కూడా మరింత పెరగొచ్చు.

ధరలు & లాంచ్‌ టైమ్‌లైన్‌

ప్రస్తుతం టాటా టియాగో ఎలక్ట్రిక్‌ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ కూడా ఇదే ధర పరిధిలో ఉండే అవకాశం ఉంది.

ఈ కారు 2026 రెండో భాగంలో భారత మార్కెట్లో లాంచ్‌ కావొచ్చని అంచనా. లాంచ్‌ అయిన తర్వాత ఇది MG కామెట్‌, సిట్రోయెన్‌ eC3 వంటి ఎలక్ట్రిక్‌ కార్లతో పోటీలో ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Renault Duster, Kiger, Triber, Kwid కార్లపై రూ.2.10 లక్షల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?
రెనాల్ట్‌ డస్టర్‌ మీద రూ.2.10 లక్షలు, క్విడ్‌ మీద రూ.40,000 వరకు తగ్గింపు.. ఇంకొన్ని రోజులే!
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Engine Warm Up: పెట్రోల్, డీజిల్, CNG కార్లను నడిపే ముందు ఎంత సేపు ఆన్‌లో ఉంచాలి? కంపెనీలు ఏం చెబుతున్నాయి?
చలికాలంలో కారును స్టార్ట్ చేసిన వెంటనే డ్రైవ్ చేయొచ్చా? ఇంజిన్‌ వేడెక్కేవరకు వెయిట్‌ చేయాలా?
Electric Scooter Sales: జనం ఎక్కువగా కొంటున్నది ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లనే.. అక్టోబర్‌లో రెట్టింపు అమ్మకాలు!
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొంటారా? ప్రస్తుతం దేశంలో నంబర్‌ 1, నంబర్‌ 2 కంపెనీలు ఇవే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Embed widget