Health Benefits of Coffee : కాఫీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఈ డ్రింక్‌తో మధుమేహం, గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చట, కానీ కండీషన్స్ అప్లై
Coffee Health Benefits : కాఫీతో డయాబెటిస్, గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని తాజా అధ్యయనం చెప్తోంది. ఇంతకీ ఎన్ని కప్పుల కాఫీని, ఎలా తాగితే మంచిదంటే..
Coffee and Health : కాఫీ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఎందుకంటే కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదనే వార్తలు చాలా వినే ఉంటారు. కానీ కాఫీని లిమిటెడ్ మోతాదులో చెప్పిన విధంగా తీసుకుంటే కూడా అన్నే ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక, ప్రాణాంతక సమస్యలను దూరం చేయడంలో కూడా కాఫీ హెల్ప్ చేస్తుందట. ఇది తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
మితమైన మోతాదులో కాఫీ, కెఫిన్ తీసుకుంటే.. గుండె సంబంధిత, జీవక్రియ వ్యాధులు దూరమవుతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ, మెటబాలిజంలో ఈ అధ్యయనం గురించి ప్రచురించారు. రోజూ లిమిటెడ్‌గా కాఫీ తాగేవారిలో కార్డియోమెటబోలిక్ వ్యాధుల అభివృద్ధి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో జీవక్రియ కూడా మంచి ఫలితాలిచ్చినట్లు పేర్కొన్నారు.
కార్డియోమెటబాలిక్ వ్యాధులంటే..
కార్డియోమెటబాలిక్ వ్యాధులు అనేవి గుండె, మెటబాలిజం(జీవక్రియ) ఇతర సమస్యలతో నిండి ఉంటుంది. గుండె పోటు, స్ట్రోక్, మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత, నాన్ ఆల్కహాలిక్ లివర్ డీసిజ్, బీపీ వంటి వ్యాధుల సమూహంగా చెప్పవచ్చు. ప్రస్తుతం దాదాపు అందరూ ఇలాంటి దీర్ఘకాలిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల పరిస్థితి దారుణం కావొచ్చు. కానీ ఆరోగ్యంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నవారికి మాత్రం ఇది మేలు చేస్తుందని చెప్తున్నారు.
రోజుకు ఎంత తాగితే మంచిది
కెఫిన్, కాఫీ తాగనివారితో పోలిస్తే.. రోజుకు మూడు కప్పుల కాఫీ తాగే వారిలో కార్డియోమెటబోలిక్ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేల్చారు. కాఫీ, కెఫిన్ అనేది గుండె సమస్యలను దాదాపు అన్ని దశలలో కంట్రోల్ చేస్తుందని గుర్తించారు. ఈ రిజల్ట్స్ ప్రకారం రోజుకు మూడు కప్పుల కాఫీ లేదా 200 నుంచి 300 mg కెఫిన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నవారిలో గుండె సమస్యలను, మధుమేహాన్ని, ఇతర జీవక్రియ సమస్యలను దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు.
కాఫీ అంటే పాలు వేసేసుకుని.. షుగర్ పాకంలా చేసుకోవడం కాదట. మిల్క్ లేని బ్లాక్ కాఫీతో మాత్రమే ఈ ప్రయోజనాలు అందుతాయని చెప్తున్నారు. కెఫిన్లో భాగంగా టీలో కూడా పాలు లేకుండా బ్లాక్ టీ తాగాలట. షుగర్‌ని కూడా వీలైనంత అవాయిడ్ చేయాలి. అప్పుడే వీటి బెనిఫిట్స్ ఆరోగ్యానికి అందుతాయి.
కాఫీ.. కండీషన్స్ అప్లై
ఈ పరిశోధన ప్రకారం కాఫీ, కెఫిన్ తీసుకోవాలి కానీ.. ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం ఈ రిజల్ట్స్ రివర్స్ అవుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలాగే ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ.. కాఫీ, కెఫిన్ తీసుకుంటే పరిస్థితి దారుణంగా మారుతుందని చెప్తున్నారు. ఎందుకంటే.. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి కాఫీ, కెఫిన్ లిమిట్‌గా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ.. ఇప్పటికే కార్డియోమెటబాలిక్ వ్యాధి ఉన్నవారు వీటిని తీసుకుంటే ఆ వ్యక్తులు చనిపోయే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
Also Read : సైనస్‌ను కంట్రోల్ చేయడానికి వీటిని ఫాలో అయిపోండి.. సైనసిటిస్ లక్షణాలు, కారకాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.