Sinusitis : సైనస్‌ను కంట్రోల్ చేయడానికి వీటిని ఫాలో అయిపోండి.. సైనసిటిస్ లక్షణాలు, కారకాలు ఇవే
Home Remedies for Sinusitis : వింటర్లో ప్రధానంగా వేధించే సమస్యల్లో సైనసిటిస్ ఒకటి. దీని లక్షణాలు, చికిత్స.. ఎలాంటి వాటివల్ల సైనస్ ట్రిగర్ అవుతుందో చూసేద్దాం.
Sinusitis Prevention Tips : శీతాకాలంలో సైనసైటిస్ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. సైనసిటిస్ లక్షణాలు అభివృద్ధి చేసే కారకాలు పెరుగుతాయి. అందుకే ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. చలికాలంలో సైనసిటిస్‌ను ట్రిగర్ చేసే కారకాలు ఏంటి? వాటి లక్షణాలు, ఎలాంటి మెడికల్ హెల్ప్ తీసుకోవాలి? ఎలా కంట్రోల్ చేయవచ్చు వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
సైనసిటిస్ పెంచే కారకాలివే..
చలికాలంలో పొడిగాలి, చలిగాలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది శ్లేష్మ పొరను పొడిగా చేసి.. శ్లేష్మాన్ని చిక్కగా చేస్తుంది. దీనివల్ల జలుబు ఎక్కువగా ఉంటుంది. వింటర్లో చాలామంంది హీటింగ్ సిస్టమ్‌లు వాడతారు. అయితే ఇండోర్ హీటింగ్ టూల్స్ సైనస్ ఉన్నవారిని మరింత చికాకు పెడతాయి. పెట్స్ కూడా సైనస్ ఉండేవారి మరో ట్రిగరింగ్ పాయింట్‌ని వాటికి వీలైనంత దూరంగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు. గాలి కాలుష్యం, గాలి నాణ్యత, జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశముందని చెప్తున్నారు నిపుణులు.
సైనసిటిస్ లక్షణాలు ఇవే
సైనసిటిస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ముఖంలో క్లియర్‌గా కనిపిస్తాయి. ముఖంలో నొప్పి లేదా ఒత్తిడి ఉంటుంది. ఇది అత్యంత సాధారణ లక్షణం. కళ్లు, నుదురు, బుగ్గల చుట్టూ ఈ లక్షణం కనిపిస్తుంది. సైనస్ ఉన్నవారికి ఒత్తిడి వల్ల తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ముక్కు మూసుకుపోయి.. జలుబు ఎక్కువగా ఉంటుంది. గొంతు నొప్పి చికాకు పెడుతుంది.
చలికాలంలో సైనస్‌ను కంట్రోల్ చేయడం ఎలా?
చలికాలంలో సైనస్‌ను తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలి. పొడిగాలిని తగ్గించుకోవడానికి హ్యూమిడిఫైయర్ను ఉపయోగించాలి. సైనస్‌లు పొడిగా మారకుండా ఉండడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. పెంపుడు జంతువులకు దూరంగా ఉంటే మంచిది. ఎయిర్ ప్యూరిఫైయర్లు అలెర్జీ కారకాలు, దుమ్ము, పెట్స్ వల్ల కలిగే ఇబ్బందులను ఫిల్టర్ చేసి.. గాలి నాణ్యతను పెంచుతాయి.
సైనస్ నివారణ చర్యలు
సైనస్ లక్షణాలు అభివృద్ధి చెందకుండా కొన్ని నివారణ చర్యలు ఫాలో అవ్వాలి. ఆవిరి తీసుకుంటూ ఉండాలి. హాట్ షవర్ చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. వేడి సూప్‌లు తాగితే గొంతు రిలాక్స్ అవుతుంది. సైనస్‌ను క్లియర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సెలైన్ స్ప్రేతే ముక్కును కడిగితే తేమ అంది.. శ్లేష్మాన్ని తొలగించడంలో హెల్ప్ చేస్తుంది. సమతుల్య ఆహారం తీసుకుంటూ.. వ్యాయామం చేస్తూ ఉంటే ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది.
మెడికల్ హెల్ప్
సైనసైటిస్ ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పరిస్థితి మెరుగుకాకపోతే.. కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. మీ పరిస్థితి, ట్రిగర్ పాయింట్స్ ఆధారంగా వారు మీకు మెడిసన్స్ సిఫార్సు చేస్తారు. డీకాంగెస్టెంట్లు, ఓరల్ స్టెరాయిడ్స్, యాంటీహిస్టామైన్లు, నాసల్ స్టెరాయిడ్ స్ప్రేలు, యాంటీబయాటిక్స్‌ను సైనస్‌ను కంట్రోల్ చేయడానికి వైద్యులు సిఫార్సు చేస్తారు.
Also Read : చలికాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.