అన్వేషించండి

Winter Asthma Tips : చలికాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే 

Controlling Asthma in Winter : వింటర్​లో ఆస్తమా రోగులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది ప్రాణాలకే ముప్పు అంటున్నారు నిపుణులు. చలికాలంలో ఆస్తమా రోగులు ఫాలో అవ్వడానికి కొన్ని టిప్స్ ఇస్తున్నారు. 

Tips To Control Asthma During Winters : ఆస్తమా దీనినే ఉబ్బసం అని కూడా అంటారు. మనిషికి దీర్ఘకాలికంగా ఊపిరి అందకుండా చేసే శ్వాసకోశ వ్యాధి. పిల్లల నుంచి పెద్దల వరకు వయసు తేడా లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. పిల్లల్లో జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ప్రభావితం చేస్తే.. పెద్దల్లో దుమ్ము, ధూళి, వాయు కాలుష్యం, మానసిక ఆందోళన, వ్యాయామం వంటి మొదలైన అంశాలు ట్రిగర్ చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ ఆస్తమా ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. 

చలికాలంలో చల్లనిగాలి.. గాలి నాణ్యతలో క్షీణింపు వంటివి ఆస్తమా ప్రభావాన్ని పెంచుతాయి. కాలుష్య కారకాలకు గురై.. శ్వాసనాళాల్లో ఇబ్బందులు ఏర్పడుతాయి. సెన్సిటివ్​గా మారి.. వాపు కలుగుతుంది. అందుకే శీతాకాలంలో ఆస్తమా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఆస్తమాను తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి? ఆస్తమాను కంట్రోల్ చేయడంలో అవి ఏవిధంగా హెల్ప్ అవుతాయో చూసేద్దాం. 

చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. 

వెచ్చగా ఉండేందుకు : చలికాలంలో చల్లదనాన్ని, చలిగాలుల నుంచి కాపాడుకునేందుకు దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వెటర్స్ ధరించడమే కాకుండా లేయరింగ్ పద్ధతిలో దుస్తులు వేసుకోవాలి. చేతులకు గ్లౌవ్​లు కచ్చితంగా వాడాలి. కాళ్లకు చలి తగలకుండా షూలు వేసుకోవాలి. బయటకు వెళ్తే తలని స్కార్ఫ్ లేదా టోపీతో కవర్​ చేయాలి. ముఖానికి మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాలి. దీనివల్ల చల్లగాలి ప్రభావం తగ్గుతుంది. ఆస్తమా ప్రభావం తగ్గే అవకాశాలు ఎక్కువ. 

హ్యూమిడిఫైర్ : వింటర్​లో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. పొడిగాలి ఆరోగ్యాన్ని వివిధరకాలుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా రోగులు దీని ఎఫెక్ట్ ఎక్కువగా చూస్తారు. కాబట్టి గాలిలో తేమను పెంచేందుకు, చికాకును తగ్గించేందుకు హ్యూమిడిఫైర్​ని ఉపయోగించాలి. ఇది పొడిగాలిని తగ్గించి.. శ్వాసనాళాలపై ప్రతికూల ప్రభావం లేకుండా హెల్ప్ చేస్తుంది. 

వ్యాయామం : ఇంట్లో చేయగలిగే వ్యాయామాలు చేయాలి. ఇవి మిమ్మల్ని యాక్టివ్​గా ఉంచి.. వేడిగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే ఆస్తమా సమస్యలు రాకుండా చేస్తాయి. యోగా, బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​లు, ఎరోబిక్స్ వంటివి శ్వాస సమస్యలను దూరం చేస్తాయి. మెడిటేషన్ ఒత్తిడిని తగ్గించి.. ఆస్తమా ప్రభావాన్ని తగ్గిస్తుంది. 

హైడ్రేషన్ : ఏకాలంలోనైనా హైడ్రేటెడ్​గా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు చలికాలంలో నీరు తాగడాన్ని అస్సలు మరచిపోకూడదు. హైడ్రేట్​డ్​గా ఉండడం వల్ల పొడిగాలి ప్రభావం ఎక్కువగా ఉండదు. చర్మానికి, జుట్టుకు కూడా మంచి ప్రయోజనాలు అందుతాయి. 

ట్రిగర్స్ : ఆస్తమాను ట్రిగర్ చేసే కొన్ని అంశాలు ఉంటాయి. ఒక్కొక్కరిని ఒక్కో అంశం ప్రభావితం చేస్తుంది. కొందరిని స్మోకింగ్ ట్రిగర్ చేస్తే.. మరికొందరిని పొడిగాలి, ఫుడ్​ కూడా ట్రిగర్ చేస్తుంది. దుమ్ము, కాలుష్యం కూడా ఆస్తమాకు ట్రిగరింగ్ పాయింట్స్​గా చెప్పొచ్చు. ఇలా అనేకరకాల ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అలాగే ఏ పని చేసినా.. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. 

Also Read : ఆస్తమా ఉన్నవారిని ట్రిగర్ చేసే అంశాలు ఇవే.. అస్సలు తినకూడని ఫుడ్స్ లిస్ట్

మందులు : ఆస్తమాను కంట్రోల్ చేసేందుకు వైద్యులు సూచించే మందులు కచ్చితంగా ఉపయోగించాలి. ఇన్​హేలర్​ని మీకు అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్తమా ట్రిగర్ అయిన సమయంలో ఇన్​హేలర్​ని కచ్చితంగా ఉపయోగించాలి. 

ఈ అంశాలన్నీ చలికాలంలో ఆస్తమాను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి. వైద్యులు, నిపుణుల సూచనలు తీసుకుంటే మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Look Back 2024: IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
Best Gaming Smartphones Under Rs 20000: రూ.20 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే - హెవీ గేమ్స్ ఈజీగా ఆడేయచ్చు!
రూ.20 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే - హెవీ గేమ్స్ ఈజీగా ఆడేయచ్చు!
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Embed widget