అన్వేషించండి

World Asthma Day 2024 : ఆస్తమా ఉన్నవారిని ట్రిగర్ చేసే అంశాలు ఇవే.. అస్సలు తినకూడని ఫుడ్స్ లిస్ట్

Asthma Day 2024 : దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యనే ఆస్తమా అంటారు. ఈ ప్రాణాంతక సమస్య ఉన్నవారు ఎలాంటి ఫుడ్స్​ తినాలి? లైఫ్​స్టైల్ ఎలా ఉండాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Asthma Prevention Tips : ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్య. ఈ వ్యాధి నయం కాదు. అందుకే ఈ వ్యాధిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు.. ప్రతి సంవత్సరం మే 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆస్తమా దినోత్సవం (World Asthma Day 2024) చేస్తున్నారు. ఆస్తమా సమస్యలు, వ్యాధిని ట్రిగర్ చేసే అంశాలు.. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాంటివి తినకూడదు వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ డేని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2016లో దాదాపు 340 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో ఇబ్బంది పడ్డారని.. నాలుగు లక్షలకు పైగా చనిపోయారని WHO తెలిపింది.

సరైన అవగాహన లేకనే చాలామందిలో ఈ వ్యాధి ప్రాణాలు హరిస్తుందని గుర్తించి.. దానిపై పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిగా 1998లో ఈ ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆస్తమాను ఉబ్బసం అంటారు. ఇది ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలలో కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఈ సమస్య వలన శ్వాసనాళాలు ఉబ్బి.. ఇరుకుగా మారి.. దగ్గు, గురక, శ్వాసలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఎలాంటి పరిస్థితులు దీనిని ట్రిగర్ చేస్తాయి.. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్స్​కి దూరంగా ఉండాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్తమాను ట్రిగర్ చేసే అంశాలు

ఆస్తమాలో వివిధ రకాలు ఉన్నాయి కానీ.. లక్షణాలు అనేవి అందరిలోనూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. గాలినాణ్యత సరిగ్గా లేకుంటే ఆస్తమా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దుమ్ము, డస్ట్, పుప్పొడి, ఎలుకల ద్వారా కూడా కొందరిలో ఆస్తమా వచ్చే అవకాశముంది. సిగరెట్ పొగ, కెమికల్స్, పర్యావరణ కాలుష్య కారకాలు కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయి. ఫుడ్ అలెర్జీ, స్లీప్ ఆప్మియా, ఊబకాయం, శ్వాసకోశ వ్యాధులు, మందు, సిగరెట్, డ్రగ్స్ ఇలా మొదలైనవన్నీ ఆస్తమాను ట్రిగర్ చేస్తాయి. 

ఫుడ్​ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Asthma Day 2024 ఆస్తమాను ఫుడ్​ కూడా ట్రిగర్ చేస్తుంది. కాబట్టి తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. తాజా, పోషకాలతో కూడిన ఆహారం తినడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. దీనివల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలా అని ఆస్తమాను పూర్తిగా తగ్గించగల ఆహారం లేదు. కానీ తాజా పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యప్రయోజనాలు పొందుతారు. 

ఆహారంలో పాలు, గుడ్లు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. క్యారెట్, ఆకుకూరలు, బీటా కెరోటిన్ అధికంగా ఉండే కూరగాయలు, గుమ్మడి గింజలు, మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఇవి ఆస్తమా లక్షణాలు పెరగుకుండా హెల్ప్ చేస్తాయి. 

ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదంటే..

డ్రై ఫ్రూట్స్​, వైన్​లలో ఉండే సల్ఫైట్స్ ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. బీన్స్, క్యాబేజి, ఉల్లిపాయలు, గ్యాస్​ను విడుదల చేసే ఫుడ్స్​ కూడా ఉబ్బసాన్ని తీవ్రం చేస్తాయి. ఎందుకంటే ఇవి గ్యాస్​ను విడుదల చేసి.. ఊపిరితిత్తులపై మరింత ప్రెజర్​ను ఇస్తాయి. కొన్నిరకాల కెమికల్స్, సాలిసైలేట్​లు కలిగిన ఫుడ్స్ తినకపోవడమే మంచిది. 

ఆస్తమాకు చికిత్స తీసుకున్న పూర్తిగా తగ్గదు. కాబట్టి.. ఈ దీర్ఘకాలిక వ్యాధిని లైఫ్​స్టైల్​లోని కొన్ని మార్పులతో కంట్రోల్ చేయవచ్చు. దీనివల్ల మరణాలు దూరమవుతాయి. ఇదే ఉద్దేశంతో ఏటా ఆస్తమా డేను నిర్వహించి.. ప్రజలకు ఈ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. 

Also Read : బరువు తగ్గించడంలో, హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ ఇవి.. రెగ్యూలర్​ డైట్​లో చేర్చుకోండిలా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
KTR: కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
KTR: కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
Mount Everest: ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
Jani Master Diwali Celebration: కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్, వారికి అసలైన పండుగ
కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్, వారికి అసలైన పండుగ
Pawan Kalyan: 'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget