వేడిని తగ్గించి చలువ చేసే కూరగాయల్లో సొరకాయ ఒకటి. దీనిని జ్యూస్‌గా చేసుకుని రెగ్యూలర్‌గా తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఈ జ్యూస్‌ని సమ్మర్లో తాగితే దాహాన్ని తీర్చి.. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. సొరకాయలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, బిలు కలిగి ఉంటుంది. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు రోజూ దీనిని తాగినా, డైట్లో చేర్చుకున్న మంచి ప్రయోజనాలు పొందుతారు. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె హెల్తీగా ఉండేలా చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియను అందించి.. సమ్మర్లో స్టమక్ బ్లోటింగ్ లేకుండా చేస్తుంది. పిత్తా, కఫ దోషాలను దూరం చేయడం కోసం ఆయుర్వేదంలో సొరకాయను ఉపయోగిస్తారు. ఇవి కేవలం అవగాహన కోసమే. మంచి ఫలితాల కోసం వైద్యులను సంప్రదించాలి. (Images Source : Envato)