బరువు తగ్గాలంటే రాత్రి పూట ఈ స్నాక్స్ తినొద్దు రాత్రి పూట కొవ్వులు, క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు పెరిగేందుకు, టైప్2 డయాబెటిస్ వంటి వ్యాధులు రావచ్చు. సోడా పానీయాలు నిద్రకు ముందు తీసుకుంటే నిద్ర పట్టదు. వీటిలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. నిద్రకు ముందు పాప్ కార్న్ తింటే అజీర్తి, అసౌకర్యం, నిద్ర లేమి సమస్యలు రావచ్చు. తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం అవసరం. రాత్రి పూట టామాట కెట్చప్ వంటివి తీసుకుంటే అసిడిటి, గుండెల్లో మంటకు కారణం కావచ్చు. బేకన్, హామ్ వంటి మాంసాహారం, చీజ్ వంటి పాల పదార్థాల్లో టైరమిన్ ఉంటుంది. ఇది చురుకుగా ఉంచి నిద్ర పట్టకుండా చేస్తుంది. చీజ్ తక్కువ, తక్కువ సాస్ లు ఉపయోగించి చేసిన హేల్దీ పిజా తినొచ్చు. ఇది పెద్దగా ఇబ్బంది కలిగించదు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే