రెడ్ కలర్ కప్పులో డ్రింక్స్ తాగితే తియ్యగా ఉంటాయా ? ఎర్ర కప్పుల్లో పానీయాలు తాగితే చక్కర తక్కువగా తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీలు, దానిమ్మ వంటి తియ్యని పండ్లు ఎరుపు రంగులో ఉంటాయి. రెడ్ కలర్ తీపితో సంబంధం కలిగి ఉంటుందట. జ్యూసులు వాటి అసలు రుచికంటే రెడ్ కలర్ కప్పులో తాగితే తియ్యగా ఉందని అనుకుంటారట. రెడ్ కలర్ కప్పును చూడగానే బ్రెయిన్ ఎక్కువ చక్కెర తీసుకోవాలన్న కోరికను తగ్గిస్తుందట. మనస్తత్వ, ఇంద్రియ శాస్త్రాలు,పలు పరిశోధనల ప్రకారం ఆహారం, పానీయాల రంగు రుచి అవగాహనను ప్రభావితం చేస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి చార్లెట్ స్పెన్స్ చేసిన అధ్యయనం రంగు రుచిని పెంచుతుందని తెలిపారు. రుచిపై రంగు ప్రభావం ఉన్నప్పటికీ కాఫీ వంటి పానీయాలు కాఫీగింజలు, బ్రూయింగ్ టెక్నిక్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.