వేసవిలో గుడ్లు తప్పనిసరిగా తినాలి. ఎందుకో తెలుసా? గుడ్లు పోషకాల పవర్ హౌస్. ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్ ఫుష్కలంగా ఉంటాయి. వేసవిలో వీటిని తప్పక ఆహారంలో చేర్చుకోవాలి. వేసవిలో గుడ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందనడం అపోహ మాత్రమే. గుడ్లలో పొటాషియం, సోడియం, ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. వేడి వాతావరణంలోనూ ద్రవ సమతుల్యతను కాపాడుతాయి. గుడ్లలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. అలసటతో పోరాడుతుంది. విటమిన్లు ఎ, డి, బి12, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి. గుడ్లలోని యాంటీఆక్సిడెంట్లు కళ్లను రక్షిస్తాయి. వయస్సు సంబంధిత మచ్చలను తగ్గిస్తాయి. సమ్మర్ బ్రేక్ ఫాస్ట్, లంచ్, సలాడ్ లో గుడ్లు తీసుకోవచ్చు. సమ్మర్ సూప్ లలో ఉడికించిన గుడ్లను తీసుకోండి. గుడ్లకు ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నట్స్, సీడ్స్, పోషక ఈస్ట్, మొక్కల ఆధారిత ప్రొటీన్స్ తీసుకోవచ్చు.