వేసవిలో డీహైడ్రేషన్ తగ్గించే డ్రింక్స్ ఇవే ఎండలు మండిపోతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలకు డీహైడ్రేషన్ బారిన పడతాం. ఎండాకాలంలో ఆరోగ్యాంగా ఉండాలంటే ఎలక్ట్రోలైట్లు, అవసరమైన పోషకాలు ఉన్న ద్రవాలను తాగడం మంచిది. కొబ్బరినీళ్లలో ఇతర రసాల కంటే తక్కువ చక్కెర కేలరీలు ఉంటాయి. ఇందులో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. వేసవిలో బెస్ట్ డ్రింక్. పుచ్చకాయలో సాధారణంగా రెండు ఎలక్ట్రోలైట్లు, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతాయి. నిమ్మకాయ జ్యూస్ బెస్ట్ డిటాక్స్ పానియాలలో ఒకటి. సోడియం, పొటాషియం, కాల్షియం ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. ఆరోగ్యాన్నికాపాడుతాయి. దోసకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ పొటాషియం ఉంటుంది. వేసవిలో దోసకాయ తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. పుదీనాను శీతలీకరణ ఏజెంట్ గా పిలుస్తారు. సహజ ఎలక్ట్రోలైట్స్, కేలరీలు తక్కువగా ఉంటాయి. హైడ్రేట్ గా ఉండాలంటే పుదీనానీళ్లు తాగాలి.