మందు బాబులకు వడదెబ్బ ముప్పు ఎక్కువ, ఎందుకో తెలుసా?

నీళ్లు తక్కువ తాగే వారికి, గర్భిణీలకు, చిన్న పిల్లలకు వడదెబ్బ ముప్పు ఎక్కువ.

ఆల్కాహాల్ తీసుకునే వారికి వడదెబ్బ తగిలే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది.

మద్యం తీసుకోవడం వల్ల శరీరం ఈజీగా డీహైడ్రేట్ అయి వడదెబ్బ తగులుతుంది.

వడదెబ్బ తగిలినప్పుడు చల్లని గుడ్డతో 10 నిమిషాలకు ఓసారి ఒళ్లంతా తుడవాలి.

నిమ్మరసం, ఉప్పు, తేనె కలిపిన డ్రింక్ తాగించాలి.

కొబ్బరి నీళ్లు, సబ్జా గింజల నీళ్లు తాగడం వల్ల వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఎండలు మండుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లకూడదంటున్నారు వైద్యులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.