అన్వేషించండి

Protein Foods for Weight Loss : బరువు తగ్గించడంలో, హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ ఇవి.. రెగ్యూలర్​ డైట్​లో చేర్చుకోండిలా

Tips to Weight Loss : బరువు తగ్గాలంటే.. మనం శరీరానికి ప్రోటీన్ ఫుడ్స్​ని అందించాలి. అయితే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే శరీరానికి ప్రోటీన్ అంది.. హెల్తీగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. 

These Foods will Help You to Reduce Weight : రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్​ కచ్చితంగా ఉండాలి. ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయం పక్కన పెడితే.. కొందరు కనీసం ప్రోటీన్​ లేకుండానే తమ భోజనాన్ని ముంగిచేస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. పైగా ప్రోటీన్​ పౌడర్​లలో కూడా కల్తీ పెరిగింది. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గకపోగా.. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ డైట్​లో సహజంగా దొరికే ప్రోటీన్ ఫుడ్స్​ని తీసుకోవాలని సూచిస్తున్నారు. అసలు బరువు తగ్గడంలో ప్రోటీన్ ఫుడ్స్ ఎలా హెల్ప్ చేస్తాయంటే.. ఇవి శరీరంలో జీవక్రియను పెంచుతాయి. మెటబాలీజం పెరిగి.. కేలరీలు బర్న్ చేస్తాయి. కాబట్టి బరువు తగ్గుతారు. అయితే ప్రోటీన్ కోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

క్వినోవా

గ్లూటెన్ లేని ఫుడ్స్​ తీసుకోవాలంటే ప్రోటీన్​కు క్వినోవా మంచి సోర్స్. దీనిలో అమైనో ఆమ్లాలు, ఫైబర్, లో గ్లైసెమిక్ ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. సలాడ్​లు, సూప్​లు, సైడ్​ డిష్​గా ప్రోటీన్ తీసుకోవాలనుకుంటే వీటిని తీసుకోవచ్చు. పైగా ఇవి ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలిని తగ్గిస్తాయి. తద్వార బరువు తగ్గుతారు. 

పెరుగు

పెరుగు.. ముఖ్యంగా గ్రీక్ యోగర్ట్​లో ప్రోటీన్​, ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునేవారికి ముఖ్యమైన ఎంపిక అవుతాయి. సాధారణ పెరుగు కంటే గ్రీక్ యోగర్ట్​లో చక్కెరలు తక్కువగా ఉంటాయి. పైగా ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దీనిని మీరు స్నాక్స్​గా తీసుకోవచ్చు. స్మూతీలు, సలాడ్స్​లో కూడా దీనిని కలుపుకోవచ్చు. 

పప్పులు

వెజిటేరియన్స్​కి ప్రోటీన్​ అందడం కాస్త కష్టమే అనుకుంటారు. కానీ పప్పు ప్రోటీన్​కు మంచి సోర్స్. వీటిలో మాంసకృతులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. వీటిలో కొవ్వు కూడా తక్కువగా ఉంటాయి. కేలరీలు కూడా తక్కువే. ఇవి బరువు తగ్గడానికి మంచి ఎంపిక. ఎక్కువ కేలరీలు లేకుండా ప్రోటీన్​లతో నిండి ఉంటాయి. ఫైబర్ కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. 

గుడ్లు

ప్రోటీన్​ అంటే మొదట గుర్తొచ్చే ఫుడ్స్​లలో గుడ్లు ఒకటి. ఇవి పూర్తిగా మాంసకృతులు, విటమిన్లు, మినరల్స్​తో నిండి ఉంటాయి. అందుకే వీటిని చాలామంది తమ బ్రేక్​ఫాస్ట్​గా తీసుకుంటూ ఉంటారు. ఇవి జీవక్రియను పెంచి.. రోజంతా ఆకలిని నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి. దీనివల్ల కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. కాబట్టి వీటిని వెజిటేబుల్ సలాడ్స్​తో లేదా ఆమ్లెట్లు లేదా బాయిల్ చేసుకుని తీసుకోవచ్చు. కొందరు వెజిటేరియన్స్​ కూడా ప్రోటీన్​ కోసం ఎగ్స్​ తీసుకుంటారు. 

సాల్మన్ ఫిష్

సాల్మన్ ఫిష్ లేకుండా ప్రోటీన్ సోర్స్​ కలిగిన ఫుడ్స్​ని ఎండ్ చేయలేము. ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​తో పాటు.. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీనిలో ప్రోటీన్ మెటబాలీజంను పెంచి.. కొలెస్ట్రాల్​ను కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా వీటిని మీ డైట్​లో చేర్చుకోవచ్చు. 

కేవలం ఈ ఫుడ్సే కాకుండా.. కాటేజ్ చీజ్, టోఫు, సోయా బీన్స్, బాదం, బ్రోకలీ మీ డైట్​లో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా వెజిటేరియన్స్​కు ఇవి చాలా మంచి ఎంపిక అవుతాయి. నాన్ వెజిటేరియన్స్ చికెన్, రెడ్ మీట్ కూడా తమ డైట్లో తీసుకోవచ్చు. ఇవి బరువు తగ్గించడంలో కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో మెటబాలీజంను పెంచి.. కేలరీలు కరిగించి హెల్తీగా ఉండడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. 

Also Read : బరువును తగ్గించే టేస్టీ, హెల్తీ బ్రేక్​ఫాస్ట్.. స్ప్రౌట్స్ పోహా రెసిపీని ఇలా సింపుల్​గా చేసేయండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Embed widget