ఎండలు మండిపోతున్నాయనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి నుంచి వచ్చే మాటల్లో ఒకటి. 40-45 డిగ్రీలు.. అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ హీట్‌వేవ్స్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు రెగ్యూలర్‌గా నీటిని, జ్యూస్‌లను తీసుకోవాలని సూచిస్తున్నారు. కాటన్ దుస్తులు ఎండ వేడిని తగ్గించి.. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. మధ్యాహ్నం సమయంలో ఎట్టి పరిస్థుతుల్లో బయటకు వెళ్లకపోవడే మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే.. చేతులు, ముఖం, తలను హీట్‌వేవ్స్ నుంచి కవర్ చేయాలి. కూల్ డ్రింక్స్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. కాబట్టి నిమ్మరసం, నీరు వంటివి తీసుకోవాలి. ఎండ వేడి ఇంట్లోకి రాకుండా కర్టెన్లు కట్టాలి. ఇళ్లు చల్లగా ఉంచుకునే మార్గాలు ఎంచుకోవాలి. రోజుకి రెండుసార్లు ఉదయం, సాయంత్రం స్నానం చేస్తే మంచిది. (Images Source : Envato)