Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన

యర్రావారిపాళెం: తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యర్రావారిపాళెం మండలంలో రెండు ఏనుగులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోవడం అటవీ శాఖ వర్గాలను, స్థానికులను కలచివేసింది. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
అడవి పందుల నుంచి తమ పంటలను రక్షించుకోవడానికి స్థానిక రైతులు పొలాల చుట్టూ విద్యుత్ కంచెలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అడవి నుంచి పొలాల వైపు వచ్చిన ఏనుగులు ఆ విద్యుత్ తీగలను తాకడంతో కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మూగజీవాల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ట్రెండింగ్ వార్తలు























