అన్వేషించండి

Grapes Cleaning Tips : ద్రాక్ష పండ్లు ఇలానే శుభ్రం చేసి తినాలి.. లేదంటే పిల్లలకు, పెద్దలకు ప్రమాదమే

Tips to Wash Grapes Before Eating : ద్రాక్షలు పిల్లల నుంచి పెద్దలవరకు ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సమ్మర్​లో వీటికి డిమాండ్ ఎక్కువ. అయితే వీటిని తినే ముందు ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

Hidden Pesticides on Grapes : ద్రాక్ష పండ్లు చాలా మంది ఇష్టంగా తింటారు. పసుపు, నలుపు రంగు ద్రాక్షలు దాదాపు అన్ని సీజన్​లలో చూస్తాము. పిల్లలకు కూడా వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఇవి చూసేందుకు చాలా తాజాగా కనిపిస్తాయి. కానీ వాటిపై పురుగుమందుల అవశేషాలు, మైనం పొర, ధూళి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నేరుగా తినకూడదు. ఎప్పుడూ శుభ్రం చేసిన ద్రాక్షలు మాత్రమే తినాలి. అయితే వీటిని నార్మల్​గా వాటర్​తో కడిగేస్తే సరిపోతుందా అంటే లేదు. మరి వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో.. లేకుంటే కలిగే ఇబ్బందులు ఏంటో చూసేద్దాం. 

ద్రాక్ష పండ్లు గుత్తులుగా పెరుగుతాయి. దీనివల్ల వాటి మధ్య పెస్టిసైడ్స్ అవశేషాలు ఉండిపోయే ప్రమాదం ఉంది. అలాగే వాటి తొక్క కూడా చాలా పలుచగా ఉండటం వల్ల రసాయనాలు, మట్టి సులభంగా అతుక్కుపోతాయి. కాబట్టి సాధారణంగా నీటితో కడిగితే అవి పూర్తిగా శుభ్రం కావు. అందుకే తినే ముందు సరైన విధంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

ద్రాక్ష పండ్లను సరిగ్గా కడగకుంటే వచ్చే నష్టాలివే..

ఇటీవల Environmental Working Group ఓ జాబితా విడుదల చేసింది. ద్రాక్ష పండ్లు ఎక్కువగా పురుగుమందులు వాడే పంటల్లో నాలుగో స్థానంలో ఉన్నాయని తెలిపింది. పంటను పురుగులు, ఫంగస్‌, మొల్డ్ నుంచి రక్షించేందుకు రైతులు పలు రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ద్రాక్ష గుత్తుల్లో చిన్న చిన్న ఖాళీలు ఉండటం.. తొక్క పలుచగా ఉండడం వల్ల ఈ రసాయనాలు సులభంగా అతుక్కుంటాయి. అందుకే పిల్లలకు వాటిని ఇచ్చే ముందు బాగా శుభ్రం చేయడం అవసరం.

ద్రాక్ష పండ్లను ఎలా శుభ్రం చేయాలంటే..

ముందుగా ద్రాక్ష పండ్లను ఒక పెద్ద గిన్నెలో లేదా జల్లెడలో పెట్టి టాప్ వాటర్​ కింద 20 నుంచి 30 సెకన్ల పాటు కడగాలి. చేతులతో మెల్లగా రుద్దితే మట్టి, ధూళి, కొంతమేర రసాయనాలు తొలగిపోతాయి. ఇది పూర్తిగా శుభ్రం చేయకపోయినా తదుపరి శుభ్రపరిచే ప్రక్రియకు ఉపయోగపడుతుంది. తర్వాత బేకింగ్ సోడా కలిపిన నీటిలో ద్రాక్ష పండ్లను వేసి 10–15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత మెల్లగా రుద్ది మళ్లీ శుభ్రమైన నీటితో కడగాలి. వైట్ వెనిగర్​లో కూడా వీటిని 5–10 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలు బ్యాక్టీరియా, ఫంగస్‌, సూక్ష్మజీవులను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

ద్రాక్ష పండ్లను శుభ్రం చేసిన తర్వాత వాటిని మెల్లగా తుడిచి ఆరబెట్టాలి. కిచెన్ టవల్‌తో తుడవచ్చు. లేదా గాలిలో ఆరనివ్వవచ్చు. పూర్తిగా ఆరిన తర్వాత ఫ్రిజ్‌లో పెడితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. తినే ముందు సరైన విధంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే పురుగుమందుల అవశేషాలు, బ్యాక్టీరియా తగ్గి సురక్షితంగా తినవచ్చు. లేదంటే ఆరోగ్య సమస్యల బారిన పడి ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget