సమ్మర్​లో చెరకు రసం తాగితే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

చెరకు రసంలో ఉండే సహజ చక్కెరలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి తక్షణ శక్తిని ఇస్తుంది.

శరీరంలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ నీటి కొరతను తీరుస్తాయి. డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి.

చెరకు రసం తాగడం వల్ల చెమట ద్వారా కోల్పోయిన ముఖ్యమైన ఖనిజాలు శరీరంలో త్వరగా తిరిగి వస్తాయి.

అందులో ఉండే పొటాషియం కడుపు pH స్థాయిని సమతుల్యం చేసి జీర్ణవ్యవస్థను లోపలి నుంచి బలపరుస్తాయి.

క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం కాలేయాన్ని బలోపేతం చేయడానికి, కామెర్లు నయం చేయడానికి ఇది ఉత్తమ పానీయం.

శరీరంలో తగ్గిన ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేస్తుంది. కాలేయం పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది.

అందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లం మొటిమలను తగ్గించడంలో, చర్మంపై సహజమైన మెరుపును తీసుకురావడంలో సహాయపడుతుంది.

వేసవిలో శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. చర్మాన్ని ఎక్కువ కాలం హైడ్రేటెడ్ గా, మృదువుగా ఉంచుతుంది.

మధుమేహం ఉన్న రోగులు చెరకు రసం తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.