అన్వేషించండి

Trisha Krishnan : అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్

Trisha Reaction : తమిళ నటుడు ఓ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హీరోయిన్ త్రిష ఇండైరెక్ట్‌గా ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Trisha Reaction On Parthiban Comments : గత కొద్ది రోజులుగా కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో విజయ్ డివోర్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. విజయ్ భార్య సంగీత ఆయనపై చేసిన ఆరోపణలు... ఆ తర్వాత దళపతి విజయ్, త్రిష ఒకే ఈవెంట్‌లో కలిసి కనిపించడం చర్చనీయాంశమయ్యాయి. వీరిద్దరూ కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారనే రూమర్స్‌కు ఇది బలం చేకూర్చింది.

రీసెంట్‌గా చెన్నైలో జరిగిన అవార్డ్స్ వేడుకల్లో తమిళ నటుడు పార్తిబన్ స్టేజ్‌పై మాట్లాడుతూ... 'ఈ కుందవైని (పొన్నియన్ సెల్వన్‌లో త్రిష పాత్ర పేరు) కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి. బయటకు వస్తే ఎక్కడ లేని సమస్యలన్నీ వస్తున్నాయి.' అంటూ కామెంట్స్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా ఆయన కామెంట్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు  వస్తున్నాయి. తాజాగా, హీరోయిన్ త్రిష కూడా దీనిపై స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆమె చేసిన ట్వీట్ ట్రెండ్ అవుతోంది.

త్రిష ఏమన్నారంటే?

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నా పేరు, ఫోటో చేర్చుతున్నామని లాస్ట్ మినిట్‌లో తనకు సమాచారం ఇచ్చినట్లు త్రిష తెలిపారు. 'ఓ వ్యక్తి తన అసిస్టెంట్‌ను పంపించి కోరడం వల్లే చివరి నిమిషంలో నా పేరు, ఫోటో ఆ ఈవెంట్‌లో చేర్చారు. మైక్రో ఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన అది తెలివైన కామెంట్ లేదా కామెడినో కాదు. అది కేవలం మూర్ఖత్వాన్ని ఎక్కువ వినిపించేలా చేస్తుంది.

అవతలి వ్యక్తి గురించి తెలియకుండా వాడే అసభ్యకర పదజాలం... ఆ వ్యక్తి గురించి కంటే మాట్లాడే వారి సంస్కారం గురించి ఎక్కువగా చెబుతుంది.' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా ట్వీట్ చేశారు.

Also Read : 'దండోరా'కు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు - తెలుగు వారి ప్రతిభ చాటే చిత్రం... గద్దర్ అవార్డ్స్‌పై మూవీ టీం హర్షం

డివోర్స్ ఇష్యూ... విజయ్ రియాక్షన్

టీవీకే ఆధ్వర్యంలో చెన్నై సమీపంలోని చెంగల్పట్టు వద్ద జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో విజయ్... డివోర్స్ అంశంపై ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. 'ఇటీవల నాకు ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందుల గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. వాటిపై మీరు పోరాటం చేసి వాళ్లను బాధించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవన్నీ నేను చూసుకుంటాను. నా వ్యక్తిగత విషయాలు ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే నాకు బాధగా ఉంది. వాటి సంగతి తర్వాత చూస్తా.' అంటూ చెప్పారు.

కాగా, విజయ్ భార్య సంగీత ఆయన నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఓ నటితో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ డివోర్స్ ఇప్పించాలని కోరారు. ఏప్రిల్ 20న వీరి విడాకుల కేసు విచారణకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kara Telugu Release: తెలుగులోనూ ధనుష్ 'కర'... రిలీజ్ ఎవరు చేస్తున్నారంటే?
తెలుగులోనూ ధనుష్ 'కర'... రిలీజ్ ఎవరు చేస్తున్నారంటే?
Tharun Bhascker: నేను అలాంటి సినిమా తీస్తే నిర్మాత హుస్సేన్ సాగర్‌లోకి... తరుణ్ భాస్కర్
నేను అలాంటి సినిమా తీస్తే నిర్మాత హుస్సేన్ సాగర్‌లోకి... తరుణ్ భాస్కర్
Om Shanthi Disco Shanthi: ఆల్రెడీ కాషన్ కియా... కొత్త సినిమాకు బోయపాటి వైరల్ డైలాగ్ వాడిన మహి వి రాఘవ్!
ఆల్రెడీ కాషన్ కియా... కొత్త సినిమాకు బోయపాటి వైరల్ డైలాగ్ వాడిన మహి వి రాఘవ్!
Vijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?
నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపడేస్తా - వచ్చేది బీఆర్ఎస్సే - జగిత్యాల సభలో కేసీఆర్ వ్యాఖ్యలు
మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపడేస్తా - వచ్చేది బీఆర్ఎస్సే - జగిత్యాల సభలో కేసీఆర్ వ్యాఖ్యలు
Chandrababu Tamil Nadu Tour: ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Weather Updates: ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
ఏపీలో వింత వాతావరణం - ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
BRS Politics: జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
Venkatrami Reddy dismissed: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
Om Shanthi Disco Shanthi: ఆల్రెడీ కాషన్ కియా... కొత్త సినిమాకు బోయపాటి వైరల్ డైలాగ్ వాడిన మహి వి రాఘవ్!
ఆల్రెడీ కాషన్ కియా... కొత్త సినిమాకు బోయపాటి వైరల్ డైలాగ్ వాడిన మహి వి రాఘవ్!
Iran US War: బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
Most Selling Bikes: ప్రతినెలా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్.. గరిష్టంగా 70 కి.మీ మైలేజ్, వాటి ధరలిలా
ప్రతినెలా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్.. గరిష్టంగా 70 కి.మీ మైలేజ్, వాటి ధరలిలా
Embed widget