అన్వేషించండి

Eating Ghee on an Empty Stomach : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు

Ghee Benefits : నెయ్యిని తింటే ఆరోగ్యానికి చాలామంచిదని చెప్తున్నారు. ముఖ్యంగా ఖాళీకడుపుతో తింటే బరువు తగ్గడంతో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చట.

Ghee for Weight Loss and More : నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. ఇవి హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేయడంతో పాటు.. ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో.. ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా.. నెయ్యి తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ రోటీన్​ను ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయట. 

బరువు తగ్గడానికి.. 

నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ శరీరంలోని చెడు కొవ్వుని త్వరగా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. పొట్టను కూడా తగ్గిస్తుంది. మెటబాలీజంను పెంచి.. శరీరంలోని కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మెటబాలీజం ఎంత పెరిగే.. మీరు అంత యాక్టివ్​గా ఉంటారు. అంతే వేగంగా బరువును తగ్గించుకుంటారు. 

కొలెస్ట్రాల్ దూరం.. 

శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంతో పాటు.. కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. టాక్సిన్ల రూపంలో బయటకు పంపిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గితే గుండె సమస్యలు అదుపులో ఉంటాయి. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. 

జీర్ణ సమస్యలు దూరం

గట్​ హెల్త్​ని మెరుగుపరిచి.. తీసుకున్న ఆహారాన్ని, దానిలోని పోషకాలను శరీరానికి అందేలా చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారికి ఇది వండర్స్ చేస్తుందని ఆయుర్వేదం కూడా చెప్తోంది. 

కీళ్లు నొప్పులు దూరం.. 

కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు రోజూ ఉదయాన్నే నెయ్యి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వృద్ధాప్య దశలో వచ్చే వాటిని కంట్రోల్ చేయవచ్చు. అలాగే చలికాలంలో వచ్చే నొప్పులను తగ్గించి.. చలిని దూరం చేసి వెచ్చదనాన్ని అందిస్తుంది. 

స్కిన్ హెల్త్ 

చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, సహజమైన మెరుపును అందించాలన్నా.. మీరు రోజూ నెయ్యిని మీ రొటీన్​లో చేర్చుకోవచ్చు. ఇది స్కిన్​కి మంచి గ్లోని అందించి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తప్రసరణను మెరుగుపరిచి.. జుట్టు, స్కిన్​ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మెదడు ఆరోగ్యానికి.. 

మతిమరుపు, వయసు ద్వారా పెరిగే బ్రెయిన్ ఇబ్బందులను దూరం చేస్తుంది. జ్ఞాపకశక్తితో పాటు.. పనిపై ఫోకస్ చేసే విధంగా నెయ్యిలోని హెల్తీ ఫ్యాట్స్ హెల్ప్ చేస్తాయి. పిల్లలు కూడా దీనిని రెగ్యులర్​గా తినొచ్చు. 

ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. అలాగే ఎక్కువ మోతాదులో కాకుండా స్పూన్ తింటే మంచిదని చెప్తున్నారు. మార్కెట్లో దొరికే నెయ్యి కాకుండా.. ఇంట్లోనే మీరు దానిని చేసుకుని తింటే మంచి ఫలితాలుంటాయి. మీరు ఈ రొటీన్​ను ఫాలో అవ్వాలనుకుంటే కచ్చితంగా నిపుణులు లేదా వైద్యుల సలహా తీసుకుంటే మంచిది.

Also Read : గుడ్లను ఇలా తింటే బరువు తగ్గొచ్చు తెలుసా? టైమింగ్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget