Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
కింగ్ విరాట్ కోహ్లీ ఇటీవల తన 2.0 వెర్షన్ ఫామ్ ను చూపిస్తున్నాడు. 2016 టైమ్ లో కోహ్లీ ఏ ఫైర్ అయితే ఉండేవాడో ఇప్పుడు వన్డేల్లో అదే ఫైర్ చూపిస్తున్నాడు. లాస్ట్ ఐదు వన్డేల్లో మూడు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. అది కూడా అల్లాటప్పా జట్ల మీద కాదు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి బలమైన జట్ల మీద బాదుతున్నాడు విరాట్. ఇలా వరుసగా ఐదేసి హాఫ్ సెంచరీలు ఐదు వన్డేల్లో సాధించటం కోహ్లీకి ఇది ఐదోసారి. అంతర్జాతీయ క్రికెట్లో మరే క్రికెటర్ కూడా ఈ ఫీట్ ను 1 సారి మించి చేయలేకపోయారు. కానీ కోహ్లీ ఐదోసారి ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్ తో ఆదివారం జరిగిన మొదటి వన్డేలో 93పరుగులు సాధించిన విరాట్ తృటిలో సెంచరీ మిస్సయినా కూడా భారత్ 301 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయటంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో సంగక్కరను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని సాధించిన విరాట్...తన ఆటలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే ఇలా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవటం కోహ్లీ కిది 71వసారి. కోహ్లీ కంటే ముందు 76 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారలతో సచిన్ మాత్రమే ఉన్నాడు. ఇదే ప్రశ్నను విరాట్ ను మ్యాచ్ తర్వాత అడిగారు కామెంటేంటర్స్. ఎవరినైతే చిన్నప్పటి నుంచి ఆరాధించానో ఆయన తర్వాత స్థానంలో నిలబడటంతో తన కల నిజమైందన్న విరాట్...తన జీవితంలో జరిగిన అన్ని పనులకు తను కృతజ్ఞతతో ఉన్నానన్నారు. సాధించిన ఈ ట్రోఫీలన్నీ ఏం చేస్తున్నారని అడిగితే...అవన్నీ గుడ్ గావ్ లో ఉన్న తన తల్లికి ఇస్తానని..ఆమె ఆ ట్రోఫీలన్నీ భద్రంగా దాస్తుందని చెప్పి నవ్వేశాడు విరాట్ కోహ్లీ.





















