Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Journalists arrest: ఓ టీవీ చానల్ అరెస్టులపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు జర్నలిస్టులను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అంటున్నారు.

BRS condemned Journalists arrest: ఓ మంత్రి, ఐఏఎస్ అధికారిణిలపై అనుచిత కథనాలు ప్రసారం చేశారన్న కారణంపై ఓ టీవీ చానల్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టుల్ని హైదరాబాద్ సీసీఎస్ అరెస్టు చేయడం రాజకీయ దుమారానికి కారణం అయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు జర్నలిస్టులను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు. వ రాహుల్ గాంధీని ఉద్దేశించి మీరు చెప్పే 'మొహబ్బత్ కా దుకాణ్' ఇదేనా?" అని ఎక్స్ వేదికగా సూటిగా ప్రశ్నించారు.
Dear @RahulGandhi,
— KTR (@KTRBRS) January 14, 2026
I hope you are taking note of how the Telangana branch of your "Mohabbat ki Dukan" is trampling upon constitutional rights of citizens. Last night, three journalists were abducted by state police. In once instance, police broke open the doors of a journalist's…
జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని ఆరోపించారు. డీజీపీకి ఫోన్ చేసి వెంటనే జర్నలిస్టుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, న్యాయ సూత్రాలు పాటించకుండా పండుగ పూట అర్ధరాత్రి వేళ అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయండి @TelanganaDGP గారూ. https://t.co/vQM18Bh9yp pic.twitter.com/532jJ9vQZH
— Harish Rao Thanneeru (@BRSHarish) January 14, 2026
ఒక మహిళా ఉన్నతాధికారి - ఒక సీనియర్ మంత్రిపై అసభ్య కరమైన వార్తలను ప్రచురించడం యాదృచ్ఛికం కాదని మరో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇది ఒక లోతైన కుట్ర తోనే జరిగిందని నిజానికి పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని రోకలిబండలు ఎక్కించాల్సింది ఆ న్యూస్ చానల్ యాజమాన్యం మీద అన్నారు.
ఆంధ్ర పెత్తందారీ దాదాగిరి-తెలంగాణ ముఖ్యమంత్రి గులాంగిరి కి మళ్లీ బలి పశువులు అయింది తెలంగాణ బహుజన బిడ్డలే.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 14, 2026
జర్నలిస్ట్ లు దొంతు రమేష్, చారి, సుధీర్ లను వెంటనే విడుదల చేయండి. వారు కేవలం పావులు మాత్రమే.
ఒక మహిళా ఉన్నతాధికారి - ఒక సీనియర్ మంత్రిపై అసభ్య కరమైన వార్తలను ప్రచురించడం… https://t.co/yPB5C1xBlV
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా అరెస్టులను ఖండించారు. పోలీసులు పండగపూట ఇలా అరెస్టు చేయడం సరి కాదన్నారు.
‘జర్నలిస్టులను అర్థరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం మంచిది కాదు’
— PulseNewsBreaking (@pulsenewsbreak) January 14, 2026
ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ.. సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి pic.twitter.com/K4CfGNOokZ
సదరు టీవీ చానల్ ఆఫీసులో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు.





















