FTIIలో ప్రవేశం పొందాలంటే ముందుగా మీరు 'జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్' (JET) రాయాలి.

Published by: Raja Sekhar Allu

సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ వంటి ప్రధాన కోర్సులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Published by: Raja Sekhar Allu

ఫిల్మ్ వింగ్ (డైరెక్షన్, ఎడిటింగ్, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ) , టెలివిజన్ వింగ్ (సౌండ్, ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ) అని రెండు రకాలు ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులను పుణె క్యాంపస్‌లో జరిగే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ , పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు.

Published by: Raja Sekhar Allu

ఇంటర్వ్యూ సమయంలోనే మీ సృజనాత్మకతను పరీక్షించడానికి చిన్నపాటి ప్రాక్టికల్ టాస్క్‌లు ఇస్తారు.

Published by: Raja Sekhar Allu

చివరి దశలో అభ్యర్థులకు మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు.

Published by: Raja Sekhar Allu

భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , ఈడబ్ల్యూఎస్అ భ్యర్థులకు సీట్లలో కేటాయింపు ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

సాధారణంగా ప్రతి ఏడాది డిసెంబర్ లేదా జనవరి నెలల్లో నోటిఫికేషన్ విడుదలవుతుంది.

Published by: Raja Sekhar Allu

అడ్మిషన్ల కోసం అప్లై చేయడానికి మరియు పూర్తి వివరాల కోసం అప్పుడప్పుడు ftii.ac.in వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలి.

Published by: Raja Sekhar Allu

సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఈ చదువు అవసరం లేదు కానీ.. ఇక్కడ నేర్చుకునేది ఎంతో ఉపయోగపడుతుంది.

Published by: Raja Sekhar Allu