అన్వేషించండి

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం

భారత్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. డారిల్ మిచెల్ శతక ఇన్నింగ్స్ ఆడటంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది.

India vs New Zealand Highlights: రెండవ వన్డేలో భారత్ అన్ని విభాగాల్లో విఫలమైంది. దాంతో పర్యాటక జట్టు న్యూజిలాండ్ చేతిలో భారత్ 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీంతో న్యూజిలాండ్ 3 వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. డారిల్ మిచెల్ (Daryl Mitchell) సెంచరీ ఇన్నింగ్స్ తో భారత్‌కు ఓటమి తప్పలేదు. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో ఇండియా మొదట బ్యాటింగ్ కు దిగి 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మోస్తరు టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన కిస్వీ జట్టు 48వ ఓవర్లోనే ఈ లక్ష్యాన్ని సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన తర్వాత భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ మంచి తొలి వికెట్ భాగస్వామ్యం అందించారు. 70 పరుగుల వద్ద రోహిత్ ఔట్ కాగా, విరాట్ కోహ్లీ తో కలిసి గిల్ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఈ వన్డేలో విఫలమయ్యారు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56 పరుగులు) హాఫ్ సెంచరీ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్‌లో విఫలం కావడంతో రాహుల్ మీద బారం పడింది. అతడు జడేజాతో పాటు నితీష్ కుమార్ రెడ్డితో కలిసి భారత ఇన్నింగ్స్ నడిపించాడు. మరో ఎండ్ లో వికెట్ పడకుండా అడ్డుగోడగా నిలిచాడు.  కేఎల్ రాహుల్ 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి టీమ్ ఇండియాను 284 స్కోరుకు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్ వన్డే కెరీర్‌లో ఇది 8వ సెంచరీ. కానీ బౌలింగ్ లో విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. కివీస్ బ్యాటర్లు యంగ్ 87తో కలిసి డారిల్ మిచెల్ భారత్ ను దెబ్బకొట్టాడు. 

డారిల్ మిచెల్ శతక ఇన్నింగ్స్
న్యూజిలాండ్ 50 పరుగులకు చేరుకునేలోపే రెండు వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రాణా ఓపెనర్ డేవాన్ కాన్వే(16)ను బౌల్డ్ చేశాడు. ఆ తరువాత హెన్రీ నికోల్స్(10)ను ప్రసిద్ద్ కృష్ణ ఔట్ చేశాడు. కానీ భారత బౌలర్లు ఆ తరువాత పూర్తిగా తేలిపోయారు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లను విల్ యంగ్, డారిల్ మిచెల్ సమర్థంగా ఎదుర్కొన్నారు. మూడో వికెట్ కు డారిల్ మిచెల్, విల్ యంగ్ 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసింది. విల్ యంగ్ 87 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ డారిల్ మిచెల్ మరొక ఎండ్‌లో అలాగే నిలబడ్డాడు. డారిల్ మిచెల్ 117 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 131 పరుగులతో అజేయంగా నిలిచి న్యూజిలాండ్ కు విజయాన్ని అందించాడు. 

భారత్ తరపున కుల్దీప్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ ఒక వికెట్ తీశాడు, కానీ 10 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీశారు. తొలి వన్డేలో భారత్ నెగ్గగా, రెండో వన్డేలో కివీస్ విజయం సాధించింది. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. జనవరి 18న ఇండోర్‌ వేదికగా జరిగే వన్డే సిరీస్ విజేతను డిసైడ్ చేస్తుంది. 

ఆదుకున్న రాహుల్.. కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీ

రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఓపెనర్లలో రోహిత్ (23) విఫలమైనా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) అర్ధ సెంచరీతో రాణించాడు. అయితే కోహ్లీ (23), అయ్యర్(8) త్వరగా ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో (వన్డేల్లో 8వది) జట్టును ఆదుకున్నాడు. జడేజా (27), నితీష్ రెడ్డి (20) సహకారంతో ఇన్నింగ్స్ నిర్మించిన రాహుల్, చివరిలో గేర్ మార్చి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సెంచరీ తర్వాత రాహుల్ వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. కివీస్ బౌలర్లలో క్లార్క్ 3 వికెట్లు తీయగా, బ్రేస్‌వెల్, ఫోక్స్, జేమీసన్ లు ఒక్కో వికెట్ పడగొట్టి సమష్టిగా రాణించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rats Bite Students: కేజీబీవీలో 12 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు, ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
కేజీబీవీలో 12 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు, ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Ind vs Nam Match Highlights: T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
Advertisement

వీడియోలు

Mumbai Muscial Road | ముంబైలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు సంగీతం పాడుతుంది | ABP Desam
India va Namibia Match Preview | T20 World Cup 2026 లో మోత మొదలు పెడతారా.? | ABP Desam
Rohit Sharma on 2027 ODI World Cup | వన్డే వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందని హిట్ మ్యాన్ ధీమా | ABP Desam
Saqlain Mushtaq on Ind vs Pak Match Pitch | మ్యాచ్ ఆడకముందే ఏడుపులు మొదలు | ABP Desam
Sanju Samson Playing Against Namibia | నమీబియాతో మ్యాచ్ లో బరిలోకి దిగనున్న సంజూ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rats Bite Students: కేజీబీవీలో 12 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు, ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
కేజీబీవీలో 12 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు, ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Ind vs Nam Match Highlights: T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
Ambati Rambabu remanded: తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
MS Dhoni:'ఎంఎస్ ధోని రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది', మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు!
'ఎంఎస్ ధోని రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది', మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు!
AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌కు అసలు ఆర్కిటెక్ట్ రాజ్ కేసిరెడ్డే - బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
లిక్కర్ స్కామ్‌కు అసలు ఆర్కిటెక్ట్ రాజ్ కేసిరెడ్డే - బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
Embed widget