Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ( T20 World Cup ) మొదలు కానుంది. టీమ్ ఇండియా స్క్వాడ్ ను ఇప్పటికే ప్రకటించారు. అయితే వరల్డ్ కప్ స్క్వాడ్ లో తనను సెలెక్ట్ అవకపోవడంపై వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ (Jitesh Sharma) స్పందించాడు.
జితేష్ మాటలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి. "టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంతో చాలా ఫీల్ అయ్యాను. వరల్డ్ కప్ టోర్నీలో ఆడాలని ఎంతో కష్టపడ్డాను. టీమ్ ప్రకటించే వరకు నన్ను సెలెక్ట్ చేయలేదు అని తెలియదు. కనీసం మెసేజ్ లేదా ఫోన్ కాల్ ద్వారా కారణం చెప్పి ఉంటే బాగుండేది. కానీ సెలెక్టర్స్ తో నేను ఏకీభవిస్తాను. నేను కోచ్, టీమ్ తో మాట్లాడాను అని అన్నారు జితేష్.
టీ 20 లో మంచి ఫార్మ్ తో దూసుకుపోతున్న జితేష్ శర్మను సెలెక్ట్ చేయకపోవడంపై చర్చ కూడా జరిగింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లోను వికెట్ కీపర్ గా ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు.
కానీ వరల్డ్ కప్ కు సంజు శాంసన్ ( Sanju Samson ), ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) వైపు మొగ్గు చూపారు.





















