Washington Sundar Ruled Out | గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్
న్యూజీలాండ్ సిరీస్ లో టీమ్ ఇండియాకు మంచి స్టార్ట్ లభించింది. తొలి వన్డే మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది భారత్. అయితే ఈ మ్యాచ్ లో అల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) గాయపడ్డాడు. దాంతో మిగిలిన రెండు వన్డే మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. సుందర్ కు బదులుగా ఆయుష్ బదోనిని ( Ayush Badoni ) టీమ్ లోకి తీసుకుంది బీసీసీఐ.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన ఎడమ కింది పక్కటెముకల భాగంలో తీవ్రమైన నోపి ఎదుర్కొన్నాడు. అతనికి మరిన్ని స్కానింగ్‌లు చేయనున్నారు. ఆ తర్వాత బీసీసీఐ వైద్య బృందం నిపుణుల సలహా తీసుకుంటుంది. వన్డే సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌ల నుండి వాషింగ్టన్ సుందర్ వైదొలిగాడు. అతడి స్థానంలో ఆయుష్ బదోనిని సెలక్టర్లు ఎంపిక చేశారు అని తెలిపింది బీసీసీఐ. 26 ఏళ్ల బదోని నేషనల్ టీమ్ కు సెలెక్ట్ అవడం ఇదే తొలిసారి.
ఈ సిరీస్‌లో ఇప్పటికే ఇద్దరు ప్లేయర్స్ గాయపడ్డారు. కొద్ది రోజుల క్రితమే వికెట్ కీపర్ రిషబ్ పంత్ ( Rishabh Pant ) కూడా గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌కు అవకాశం కల్పించారు. మరోవైపు, తిలక్ వర్మ ( Tilak Verma ) సైతం గాయం టీ20 సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తేలింది.





















