Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
ఇండియా న్యూజీలాండ్ ( India vs New Zealand ) మధ్య జరిగిన తోలి వన్డే మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఒక సూపర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది భారత్. ఎప్పటి లాగానే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కూడా ఓపెనింగ్ కు వచ్చాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ .. ఆ తర్వాత చెలరేగాడు. ఆరో ఓవర్‌లో బెన్ ఫౌల్క్స్ బౌలింగ్‌లో తొలి సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కైల్ జేమిసన్ వేసిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్ ను స్టాండ్స్‌లోకి పంపించాడు. ఈ సిక్సర్‌తో రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 650 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌తో వన్డేల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 329కి చేరింది. దాంతో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ( Chris Gayle ) 328 సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ అద్భుతమైన ఫార్మ్ లో కొనసాగుతున్నాడు. ఆడుతున్నది ఒకే ఫార్మాట్ అయినప్పటికీ.. రికార్డుల మోత మోగిస్తున్నాడు.





















