India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?
భారత్, న్యూజిలాండ్‌ల ( India vs New Zealand ) మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇండియా సిరీస్‌లో 1-0 తో ఆధిక్యంలో ఉంది. రెండవ మ్యాచ్ లో కూడా గెలుస్తే భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యాన్ని సాధిస్తుంది. మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంటుంది.
ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తుండగా సుందర్ కు సైడ్ స్ట్రెయిన్ సమస్య వచ్చింది. వాషింగ్టన్ సుందర్ సిరీస్ నుంచి దూరం కావడంతో భారత టీమ్ లోకి ఆయుష్ బదోనిని ( Ayush Badoni ) తీసుకున్నారు. రెండవ వన్డేల్లో ఈ యంగ్ ప్లేయర్ అరంగేట్రం చేసే అవకాశం లభించనుంది.
అయితే ఈ టీమ్ లో నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ), ధ్రువ్ జురెల్ ( Dhruv Jurel ) వంటి కీలక ఆప్షన్స్ కూడా ఉన్నారు. రెండో వన్డే కోసం ఇండియా పెద్దగా మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి ప్లేయింగ్ లెవన్ నుంచి దూరమయ్యే అవకాశం ఉంది.





















