అన్వేషించండి

Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం

CP Sajjanar: జర్నలిస్టుల అరెస్టు విషయంలో కమిషనర్ సజ్జనార్ పై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవాలన్నారు.

Harish Rao advises Sajjanar to wear Congress scarf:  సి.పి. సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులను సమర్థిస్తూ సజ్జనార్ మాట్లాడటాన్ని తప్పుబడుతూ, ఆయన తీరుపై  హరీష్ రావు  ఘాటుగా  స్పందించారు.  పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి, అధికార పార్టీ కార్యకర్తల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జనార్ గారు.. మీరు పోలీసు అధికారిలా కాకుండా కాంగ్రెస్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారు. మీకు అంతగా ఇష్టముంటే ఖాకీ చొక్కా తీసేసి, కాంగ్రెస్ కండువా కప్పుకుని రాజకీయం చేయండి  అంటూ ఘాటుగా విమర్శించారు. జర్నలిస్టుల అరెస్టులను వెనకేసుకురావడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ధ్వజమెత్తారు.
 
గతంలో మంత్రి కొండా సురేఖ, కేటీఆర్ పై ,  ఒక అగ్ర నటిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. "ఆనాడు కేటీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద కొండా సురేఖ నోటికొచ్చినట్లు మాట్లాడినప్పుడు మీ చట్టం ఎటు పోయింది సజ్జనార్ గారు? అప్పుడు మహిళా గౌరవం మీకు గుర్తుకు రాలేదా?" అని ప్రశ్నించారు.  కేటీఆర్  విషయంలో బాధపడింది కూడా ఆయన భార్య, తల్లి రూపంలో ఉన్న మహిళలే కదా అని ప్రశ్నించారు. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు జర్నలిస్టులను ఎందుకు వేధిస్తున్నారని ఆయన నిలదీశారు.
 
జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని, కానీ దొంగల్లాగా ఇళ్లలోకి చొరబడి భయభ్రాంతులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనే కక్షతోనే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
 
మహిళా అధికారుల గౌరవం గురించి మాట్లాడుతున్న సజ్జనార్, ప్రతిపక్ష పార్టీ నేతల కుటుంబాల్లోని మహిళల గౌరవం గురించి ఎందుకు మాట్లాడటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు అసభ్యంగా మాట్లాడితే ఒక చట్టం, ఇతరులపై మరొక చట్టం ఉంటుందా అని అడిగారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సజ్జనార్ ఏమన్నారంటే? 
 
బహిరంగ జీవితంలో విమర్శలు, పరిశీలనలు సహజమని, అయితే ఒక మహిళను ఆమె ప్రభుత్వ అధికారిణి అయినా, గృహిణి అయినా మాటలతో లేదా మీడియా కథనాలతో కించపరచడం విమర్శ కాదని, అది  క్రూరత్వం అని సజ్జనార్ పేర్కొన్నారు. టీవీ స్టోరీలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా మహిళల ప్రతిష్టను దిగజార్చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనిని ప్రతి ఒక్కరూ బేషరతుగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళల క్యారెక్టర్‌పై దాడి చేయడం అంటే మనం విలువ ఇచ్చే సామాజిక పురోగతిపై దాడి చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మన ప్రాచీన సంస్కృతిలోని  ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు  అనే శ్లోకాన్ని ఉటంకిస్తూ సజ్జనార్ హితబోధ చేశారు. ప్రస్తుతం మహిళలు పరిపాలన, పోలీసింగ్, సైన్స్ వంటి రంగాల్లోనే కాకుండా ఇంటి బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుండి నడిపిస్తున్నారని కొనియాడారు. అటువంటి వారిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దాడులకు దిగడం సమాజ భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు. 

టాప్ హెడ్ లైన్స్

Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
MLA Kova Lakshmi: నాడు అడవిలోకి వెళ్లాలంటే వణుకు.. నేడు ఇంత దారుణమా? కుమ్రం భీం వర్ధంతి సభలో ఎమ్మెల్యే కోవా లక్ష్మీ
నాడు అడవిలోకి వెళ్లాలంటే వణుకు.. నేడు ఇంత దారుణమా? కుమ్రం భీం వర్ధంతి సభలో ఎమ్మెల్యే కోవా లక్ష్మీ
BRS Harish Rao:ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
Tummidi Hatti Barrage: తుమ్మిడిహట్టిపై రేవంత్ రెడ్డి వాటర్ డిప్లొమసీ - ఉత్తర తెలంగాణ దాహార్తి తీర్చే బిగ్ స్కెచ్ - అడుగు ముందుకు పడినట్లేనా?
తుమ్మిడిహట్టిపై రేవంత్ రెడ్డి వాటర్ డిప్లొమసీ - ఉత్తర తెలంగాణ దాహార్తి తీర్చే బిగ్ స్కెచ్ - అడుగు ముందుకు పడినట్లేనా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget