ఈ మధ్యకాలంలో తినే ప్రతి వస్తువు కల్తీ అవుతున్నాయి. వాటిలో నెయ్యి కూడా ఒకటి. అందుకే కొన్ని టెస్ట్‌లతో కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు అంటున్నారు. కొన్ని ఇంటి చిట్కాలతో పాటు.. ల్యాబ్ టెస్ట్‌ల ద్వారా కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు. డెన్సిటోమీటర్తో నెయ్యిని సాంద్రతను కొలవాలి. కల్తీ నెయ్యి తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. నెయ్యిలో కొన్ని చుక్కల యాసిడ్ కలిపితే.. స్వచ్ఛమైనది తక్కువ రియాక్షన్ ఇస్తుంది. కల్తీ నెయ్యి భిన్నంగా స్పందిస్తుంది. కల్తీ నెయ్యిలో తేమ ఎక్కువగా ఉంటుంది. తేమ టెస్ట్ చేస్తే ఈ విషయం తెలుస్తుంది. అందరిళ్లల్లో సహజంగా నీటితో టెస్ట్ చేస్తారు. కల్తీ నెయ్యి నీటిలో కలుస్తుంది. ప్యూర్ నెయ్యి తేలుతుంది. అయోడిన్ టెస్ట్, హీట్ టెస్ట్, డెన్సిటీ టెస్ట్ వంటి వాటితో కూడా కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు. చెంచా నెయ్యిని కరిగేవరకు వేడి చేయండి. కల్తీ నెయ్యి తక్కువ ద్రవీభవనం కలిగి ఉంటుంది. అయోడిన్ టెస్ట్, హీట్ టెస్ట్, డెన్సిటీ టెస్ట్ వంటి వాటితో కూడా కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు. (Image Source : Envato)