హెయిర్ లాస్ ఇబ్బంది పెడుతుందా? ఆనియన్ ట్రై చేయండి! ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది అందరికీ కామన్ గా అయ్యింది. హెయిర్ ఫాల్ ను తగ్గించేందుకు ఉల్లిగడ్డ చాలా ఉపయోగపడుతుంది. ఉల్లిలోని సల్ఫర్ జుట్టు కుదుళ్లలో ఉండే కెరోటిన్ ను ఉత్పత్తికి సాయపడుతుంది. ఉల్లి కొల్లాజెన్ ను కంట్రోల్ చేయడం వల్ల జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. జుట్టుకు ఉల్లిగడ్డ పేస్టును నేరుగా రాసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉల్లి పేస్టును జుట్టుకు రాసుకోవడం ఇబ్బందిగా ఉంటే మార్కెట్లో దొరికే ఆనియన్ ఆయిల్ వాడవచ్చు. సాయంత్ర పూట జుట్టు కుదుళ్లలకు ఆనియన్ హేయిర్ ఆయిల్ రాసి మసాజ్ చేయాలి. ఉదయాన్నే తల స్నానం చేయడం వల్ల జుట్టు రాలడం ఆగి, ఆరోగ్యంగా తయారువుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com