బరువు తగ్గడంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తాయి. దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇవి కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తాయి. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ పెరిగి.. కొవ్వును కరిగించి.. కండరాల బలాన్ని పెంచుతాయి. కేలరీలు తీసుకోవడం తగ్గిస్తారు కాబట్టి.. ఇది బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మెటబాలిజం పెరుగుతుంది. ఇది వాపును తగ్గించి.. బరువును కంట్రోల్ చేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి.. బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుందంటున్నారు నిపుణులు. అధిక బరువును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Image Source : Envato)