సోయా పాల నుంచి చేసిన పనీర్ టోఫూ దీన్ని బేక్ చేసి, ఫ్రైచేసి, సలాడ్ లో ఎలా తీసుకున్నా శరీరానికి కావల్సిన ఐరన్ అందుతుంది.

లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన అన్ని పప్పు ధాన్యాల్లోనూ ఐరన్ ఎక్కువే. వీటిని సలాడ్, పప్పు కూరలుగా తీసుకోవచ్చు.

పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో ఐరన్ పుష్కలం. సలాడ్ లోనూ, కూరగానూ ఎలా తిన్నా మంచిదే.

బీన్స్ లో కూడా చాలా ఐరన్ ఉంటుంది. కూరగానూ, సలాడ్ లోనూ, సైడ్ డిష్ గానూ తీసుకోవచ్చు.

మటన్ లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గొర్రె మాంసం నుంచి కావల్సినంత ఐరన్ లభిస్తుంది.

స్నాక్ గా తీసుకునేందుకు అనువుగా ఉండే గుమ్మడి గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

ఐరన్ తో పాటు చాలా పోషకాలు కలిగిన క్వినోవాను సూప్ లోనూ, అన్నంగానూ, సలాడ్ తో కలిపి కూడా తీసుకోవచ్చు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.