Mana Shankara Varaprasad Garu Collection : మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Mana Shankara Varaprasad Garu Day 1 Collection : 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్‌తో సంక్రాంతి సందడి మొదలుపెట్టింది. మెగాస్టార్ చిరుకి ఇది రెండో అతి పెద్ద ఓపెనింగ్.

Chiranjeevi's Mana Shankara Varaprasad Garu First Day Collections : మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబో సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రీమియర్లతో పాటు ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.
ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
'మన శంకరవరప్రసాద్ గారు' ఫస్ట్ డే ఇండియావ్యాప్తంగా రూ.37.10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ 'సాక్నిల్క్' వెల్లడించింది. ఇందులో సోమవారం రూ.28.50 కోట్లు రాగా... ప్రీమియర్ షోస్ ద్వారా రూ.8.6 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్లతో రూ.25 కోట్లు కలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్స్‌లోనే వన్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన చిరు రెండో చిత్రంగా నిలిచింది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో 24 గంటల్లోనే 2 లక్షల 86 వేల టికెట్స్ సేల్ అయ్యాయి.
ముందస్తు అంచనాల ప్రకారం... పెయిడ్ ప్రీమియర్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే దాదాపు రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మెగాస్టార్ చిరు ఇది అతి పెద్ద రెండో ఓపెనింగ్. ఫస్ట్ మూవీ ఆయనే హీరోగా నటించిన 'సైరా'కు దక్కింది. అయితే, ఇవి కేవలం అంచనాలు మాత్రమే కాగా మూవీ టీం నుంచి కలెక్షన్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Also Read : భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ: రవితేజ సినిమా టాకేంటి? ఎన్నారై ఆడియన్స్ ఏమంటున్నారంటే?
మూవీలో చిరు కామెడీ టైమింగ్, పంచులు, అనిల్ మార్క్ డైరెక్షన్ అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చిందంటూ అటు మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మూవీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. కేథరిన్, జరీనా వహాబ్, హర్షవర్దన్, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ వేరే లెవల్‌లో ఉంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
శంకరవరప్రసాద్ గారు (చిరంజీవి) NIA ఏజెంట్. కేంద్ర మంత్రి శర్మ (శరత్ సక్సేనా) సెక్యూరిటీ ఆఫీసర్‌గా చేస్తుంటాడు. శంకర్‌ను ఆయన ఓ ఫ్యామిలీ మెంబర్‌లా చూస్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న శంకర్, శశిరేఖ అనుకోని కారణాలతో విడిపోతారు. శంకర్ తన పిల్లలకు దూరంగా ఉన్నాడన్న విషయం తెలుసుకున్న మంత్రి... బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న అతని పిల్లలతో గడిపేలా ఏర్పాట్లు చేస్తాడు. ఇందుకోసం అదే స్కూల్‌లో పీఈటీగా జాయిన్ చేస్తాడు.
ఈ విషయం తెలుసుకున్న శశిరేఖ అక్కడి నుంచి పిల్లలను తీసుకొచ్చేస్తుంది. అసలు శశిరేఖ, శంకర్ విడిపోవడానికి కారణాలేంటి? శంకర్ తన పిల్లలకు చేరువయ్యాడా? మళ్లీ వీరిద్దరూ కలిశారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.























