Bank Holidays: నేడు (జనవరి 13న) బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా క్లోజ్ చేస్తారా ? హాలిడే లిస్ట్
January Bank Holidays | జనవరిలో బ్యాంకులకు చాలానే సెలవులు వచ్చాయి. అయితే లోహ్రీ సందర్భంగా జనవరి 13న బ్యాంకులకు హాలిడే ఉంటుందా లేదో ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది.

Bank Holidays in January 2026: జనవరి నెలలో బ్యాంకులకు సెలవుల సందడి కనిపిస్తుంది. మీరు ఏదైనా బ్యాంకు పని కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే, ముందుగా మీ రాష్ట్రంలో బ్యాంక్ సెలవుల జాబితాను చెక్ చేయడం ముఖ్యం. బ్యాంకుల సెలవులు వివిధ నగరాల్లో వివిధ కారణాలతో ఇస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి సంవత్సరం దీని పూర్తి జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. తద్వారా కస్టమర్‌లు తమ పనిని ఏ ఆటంకం లేకుండా సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.
జనవరి 13న పలు రాష్ట్రాల్లో లోహ్రీ పండుగ జరుపుకుంటారు. దీని కారణంగా ఈ రోజున బ్యాంకులు మూసివేస్తారా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. వారంలో మరిన్ని పండుగలు, జాతీయ సెలవుల కారణంగా బ్యాంకులు మూసివేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కనుక బ్యాంకుకు వెళ్లే ముందు, RBI అధికారిక బ్యాంక్ సెలవుల జాబితాను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. తద్వారా మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంక్ పని పూర్తి చేసుకోవచ్చు.
జనవరి 13న బ్యాంకులు తెరిచే ఉంటాయా?
జనవరి 13న పలు రాష్ట్రాల్లో లోహ్రీ పండుగ జరుపుకుంటున్నారు. దీని కారణంగా బ్యాంకుల్లో ఎలాంటి సెలవు ప్రకటించలేదు. RBI బ్యాంక్ సెలవుల జాబితా ప్రకారం, లోహ్రీ సందర్భంగా ఏ నగరంలోనూ బ్యాంకులకు హాలిడే ఇవ్వలేదు. కనుక నేడు మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, మీరు జనవరి 13న బ్యాంకు శాఖకు వెళ్లి మీ పని పూర్తి చేసుకోవచ్చు.
బ్యాంకుల రాబోయే సెలవులు
ఈ వారంలో బ్యాంకులకు చాలా సెలవులు వస్తున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతి, మాఘ్ బిహు కారణంగా గుజరాత్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో బ్యాంకులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో, జనవరి 15న ఉత్తరాయణ పుణ్యకాలం, పొంగల్, మాఘే సంక్రాంతి, మకర సంక్రాంతి కారణంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కింలో బ్యాంకులకు హాలిడే ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా ఒక్కరోజు మాత్రమే పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుదినంగా ఆర్బీఐ ప్రకటించింది.
అంతేకాకుండా, జనవరి 16న తమిళనాడులో తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు హాలిడే ఇచ్చారు. జనవరి 17న ఉళవర్ తిరునాల్ కారణంగా రాష్ట్రంలో బ్యాంకులు మూసివేయనున్నారు. జనవరి 18న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుందని తెలిసిందే.
జనవరిలో బ్యాంకు హాలిడేస్..
జనవరి నెలలో న్యూ ఇయర్ సందర్భంగా పలు బ్యాంకులకు హాలిడే ఇచ్చారు. జనవరి 4, 11, 18, 25 తేదీలలో ఆదివారం కనుక బ్యాంకులకు సెలవు ఉంది. జనవరి 10, 24 తేదీలలో రెండో, నాలుగో శనివారం నాడు హాలిడే ఉంటుంది. సంక్రాంతి సెలవు తరువాత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సైతం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఇచ్చారు.























