Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Sriharikota: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ-60 సోమవారం రాత్రి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ISRO Launched PSLV C - 60: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ - 60 (PSLV C-60) వాహకనౌక ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా రాత్రి 10 గంటల 15 సెకన్లకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా స్పేడెక్స్ ప్రయోగం చేపట్టారు. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ 2 ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches PSLV-C60 with SpaDeX and innovative payloads from Sriharikota, Andhra Pradesh. First stage performance normal
— ANI (@ANI) December 30, 2024
SpaDeX mission is a cost-effective technology demonstrator mission for the demonstration of in-space docking… pic.twitter.com/ctPNQh4IUO
నాలుగో దేశంగా భారత్
#WATCH | PSLV-C60 successfully launches SpaDeX and 24 payloads.
— ANI (@ANI) December 30, 2024
Indian Space Research Organisation (ISRO) launches PSLV-C60 with SpaDeX and innovative payloads from Sriharikota, Andhra Pradesh.
(Source: ISRO) pic.twitter.com/xq1fTogHGk
భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలో 2 వ్యోమ నౌకలు స్వతంత్రంగా ఒకేసారి డాకింగ్ అయ్యేలా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే.. వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో పేర్కొంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. ఈ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయి.
జనవరి 7న డాకింగ్!
#WATCH | Andhra Pradesh | PSLV-C60 successfully launches SpaDeX and 24 payloads | ISRO Chairman Dr. S Somanath says, "I announce the successful launch of the PSLV-C60 for the SpaDeX mission...The rocket has placed the satellites in the right orbit....congratulations to the entire… pic.twitter.com/dh9SUp7CXm
— ANI (@ANI) December 30, 2024
పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. పీఎస్ఎల్వీ వాహక నౌక 2 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 24 పేలోడ్లను విజయవంతంగా ప్రయోగించినట్లు పేర్కొన్నారు. డాకింగ్ ప్రక్రియకు మరో వారం పడుతుందని.. జనవరి 7వ తేదీన డాకింగ్ జరిగే అవకాశం ఉందని తెలిపారు. స్పేడెక్స్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టడం మిషన్‌లో తొలి భాగమని చెప్పారు.
Also Read: Free Bus: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటినుంచంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

