అన్వేషించండి

Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ

Telangana: సత్య నాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణలో సాఫ్ట్ వేర్ రంగ అభివృద్ధికి పలు సూచనలు, సలహాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Chief Minister Revanth Reddy met with Satya Nadella: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ మైక్రోసాఫ్ట్   సీఈవో సత్యనాదెళ్లను కలిశారు. సత్య నాదెళ్ల వ్యక్తిగత పర్యటన కోసం ఇండియాకు వచ్చారు. ఆయన స్వస్థలం హైదరాబాద్. బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో ఉన్న సత్య నాదెళ్ల ఉన్నారు. ఆయనను  అధికారికంగా కాకుండా కర్టెసీగా ప్రభుత్వ పెద్దలు కలిసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ రంగ అభివృద్ధి కోసం  సత్యనాదెళ్ల సూచనలు, సలహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగినట్లుగా తెలుస్తోంది.
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ

సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో చదువుకుని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఆయన తండ్రి యుగంధర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన కొంత కాలం క్రితం చనిపోయారు. లో ప్రోఫైల్ ఇష్టపడే సత్య నాదెళ్ల ఎక్కువ హంగామా చేయరు. హైదరాబాద్ వచ్చిన విషయం తెలియడంతో ప్రభుత్వ పెద్దలు ఆయనను కలవాలని ఆసక్తి చూపించడంతో అంగీకరించినట్లుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా అధికారికంగా పర్యటనలకు గతంలో వచ్చారు. అప్పుడు నేరుగా మైక్రోసాఫ్ట్ ఆర్ అండ్ డీకి వెళ్లి ఉద్యోగులతో సమావావేశాలు నిర్వహించేవారు. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ .. అమెరికా  తర్వాత అతి పెద్ద క్యాంపస్‌ను నిర్మిస్తోంది, డేటా, క్లౌడ్ రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది.
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ

సత్య నాదెళ్లతో జరిగి సమావేశానికి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లారు. అలాగే బీఆర్ఎస్ హయాం నుంచి తెలంగాణలో పెట్టుబడులు, ఇతర అంశాల్లో కీలకంగా వ్యవహరించి సీనియర్ అధికారి జయేష్ రంజన్ కూడా వెళ్లారు. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వెళ్లారు. సాఫ్ట్ వేర్ రంగంలో తెలంగాణలో తాము చేపట్టబోయే ప్రాజెక్టులు, ఏఐ సిటీ నిర్మాణం, ఫోర్త్ సిటీ వంటి వాటిపై ముఖ్యమంత్రి సత్యనాదెళ్లకు వివరించినట్లుగా తెలుస్తోంది. వాటిని సక్సెస్ ఫుల్ చేయడంలో నాదెళ్ల సలహాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Also Read: Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
 
సత్యనాదెళ్ల తండ్రి  1962 బ్యాచ్ ఐఎఎస్ అధికారి యుగంధర్. 2004 నుండి 2009 వరకు కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యుడిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా కూడా  పనిచేశారు. సత్య నాదెళ్ల ప్రాథమిక విద్యాభ్యాసం హైద్రాబాద్‌లో సాగింది. హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ క్రికెట్ జట్టు సభ్యుడిగా ఆయన ఉన్నాడు. లీడర్‌షిప్ క్వాలిటీస్ ను క్రికెట్ నుండి నేర్చుకొన్నట్టుగా ఆయన చెబుతారు. 2013లో హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ 90వ వార్షికోత్సవంలో సత్య నాదెళ్ల పాల్గొన్నారు.అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్శిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్  మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1992లో మైక్రోసాఫ్ట్ లో ఆయన అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగి సీఈవో అయ్యారు.       

Also Read : Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Rave తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Rave తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Pawankalyan: నాగబాబుకు మంత్రి పదవి - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
నాగబాబుకు మంత్రి పదవి - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
Aus Vs Ind Test Series: బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. 184 రన్స్ తో  కంగారూల భారీ విజయం.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. 184 రన్స్ తో కంగారూల భారీ విజయం.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ ఇన్వెస్టర్లకు ఆరేళ్లుగా అన్యాయం!, కొత్త సంవత్సరంలో తీరు మారుతుందా?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ ఇన్వెస్టర్లకు ఆరేళ్లుగా అన్యాయం!, కొత్త సంవత్సరంలో తీరు మారుతుందా?
Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Embed widget