విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
బుధవారం మొదలైన విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత మోగింది. టోర్నీ మొదటి రోజే ఏకంగా 22 సెంచరీలు నమోదయ్యాయి. అందులో రోహిత్ శర్మ ముంబై తరపున 94 బంతుల్లో 155 రన్స్ కొట్టి సెంచరీ బాదితే.. విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున 101 బంతుల్లో 131 కొట్టి వారెవ్వా అనిపించాడు. వీళ్ తర్వాత జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. 39 బంతుల్లో 125 రన్స్‌తో టోర్నీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ బాది వరల్డ్ కప్‌కి తనని సెలక్ట్ చయం ఏ మాత్రం తప్పు కాదని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక ఈ సెంచరీల మోతలో ముఖ్యంగా బిహార్ గురించి చెప్పుకోవాలి. అరుణాచల్‌తో జరిగిన మ్యాచ్‌లో బిహార్ టీమ్ ఏకంగా 3 సెంచరీలు బాదేసింది. వైబవ్ 84 బంతుల్లో 190 జస్ట్ డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ సకిబుల్ గని.. 40 బంతుల్లో 128 కొట్టడమే కాకుండా.. 32 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదేశాడు. వీళ్లిద్దరే కాకుండా కీపర్ ఆయుష్ లొహారుకా కూడా 56 బంతుల్లో 116 రన్స్‌తో సెంచరీ బాదాడు. ఇక ఒడిషా బ్యాటర్ స్వాస్తిక్ ఏకంగా 169 బంతుల్లో 212 రన్స్‌తో డబుల్ సెంచరీ బాదేశాడు.
వీళ్లే కాకుండా.. రికిభుయ్ 105 బంతుల్లో 122, హర్యానా తరపున Himanshu Rana 126, Railways తరపున Ravi Singh 109, Madhya Pradesh నుంచి Yash Dubey 103, కర్ణాటక తరపున దేవ్‌దత్ పడిక్కల్ 147, Kerala తరపున విష్ణు వినోద్ 102, Jammu Kashmir నుంచి subham khajuria 129, Vidarbha నుంచి Aman Mokhande 110, Goa నుంచి Snehal Kauthankar 107, ఒడిషా బ్యాటర్ బిప్లబ్ సామంతరే 100, Sourastra నుంచి Samar Gajjar 132, Manipur తరపున Pheitojiam jotin 101, మేఘాలయ నుంచి Arpit Bhatewara 104, Kishan Lyngdoh 106 సెంచరీలు బాదారు.





















