Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
School Holidays in Andhra Pradesh | ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా 9 రోజులపాటు సెలవులు ప్రకటించి విద్యార్థులకు శుభవార్త అందించింది.

Sankranti Holidays 2026: అమరావతి: విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారు చేసింది. జనవరి 10 నుంచి జనవరి 18 వరకు 9 రోజులు పాటు సంక్రాంతి హాలిడేస్ అని అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవు తేదీలు ఇవేనని అధికారులు స్పష్టం చేశారు. పండుగ తరువాత జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సూచించారు.
సెలవుల వివరాలు సమగ్రంగా..
సెలవుల ప్రారంభం: జనవరి 10, 2026
సెలవుల ముగింపు: జనవరి 18, 2026
మొత్తం సెలవు రోజులు: 9 రోజులు
పాఠశాలలు తిరిగి ప్రారంభం: జనవరి 19, 2026 (సోమవారం నుండి స్కూల్స్ రీఓపెన్)
ఈ సెలవులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయి.
సంక్రాంతి పండుగ ఈ సెలవులు రావడం వల్ల విద్యార్థులు తమ సొంత ఊర్లకు వెళ్లడానికి, కుటుంబంతో గడపడానికి మంచి అవకాశం లభిస్తుంది.






















