Andhra Pradesh Entrance Exam Dates: ఏపీ ఉన్నత విద్యాప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయ్! పూర్తి షెడ్యూల్ ఇదే!
Andhra Pradesh Entrance Exam Dates: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష తేదీలను అధికారులు ప్రకటించారు.

Andhra Pradesh Entrance Exam Dates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్రంలో2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన వివిధ యూజీ, పీజీ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ముందుగానే వెల్లడించడ ద్వారా అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి మండలి అవకాశం కల్పించింది.
ఏప్రిల్‌లోనే ప్రవేశ పరీక్షల సందడి
వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచే రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల పర్వం మొదలు కానుంది. షెడ్యూల్ ప్రకారం డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు రాసే ఏపీ ఈసెట్, ఏప్రిల్ 4న నిర్వహించనున్నారు. దీని తర్వాత మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు ఎంబీఏ , ఎంసీఏలో చేరాలనుకునే వాళ్ల కోసం నిర్వహించే ఏపీ ఐసట్ ఏప్రిల్ 28న జరనుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పీజీ కోర్సుల్లో చేరడానికి రాసే ఏపీ పీజీఈసెట్ పరీక్షలను ఏప్రిల్ 29, 30, మే 2 తేదీల్లో నిర్వహించనున్నట్టు అధికారులు ధ్రువీకరించారు.
మే నెలలో పరీక్షల జాతర
మే నెల విద్యార్థులకు అత్యంత కీలకంగా మారనుంది. న్యాయ విద్య, ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని అనుకునే వాళ్ల కోసం నిర్వహించే లా సెట్, ఎడ్‌సెట్ మే 4న నిర్వహిస్తారు. వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీసెట్ మే 5, 8,9, 10, 11 తేదీల్లో విడతల వారీగా జరగనుంది.
అత్యంత పెద్ద పరీక్ష
ఏపీ ఎప్‌సెట్ రాష్ట్రంలో అత్యధిక మంది విద్యార్థులు పోటీ పడే ఎప్‌సెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే 12, 13, 14, 15, 18 తేదీల్లో జరుగుతాయని విద్యామండలి పేర్కొంది.





















