Hyderabad Crime News: హైదరాబాద్ శివారులో భారీగా మత్తుమందు స్వాధీనం, న్యూ ఇయర్ టార్గెట్‌గా డ్రగ్స్ దందా
Hyderabad Drugs News | న్యూ ఇయర్ వేడుకలు లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ లోకి భారీగా డ్రగ్స తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగర శివార్లలో తనిఖీలు చేపట్టిన పోలీసులు 2 కేజీల మత్తు పదార్థాలు సీజ్ చేశారు.
Drug racket at Hyderabad suburbs | హైదరాబాద్: ఇంగ్లీష్ న్యూ ఇయర్ సందర్భంగా భారీగా డ్రగ్స్, మత్తు పదారాలు నగరంలోకి వస్తాయని పోలీసుల ఆకస్మితక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివారులో భారీగా మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్న 2 కేజీల పప్పిస్ట్రా అను మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేజీల మత్తు పదార్థం పప్పిస్ట్రా స్వాధీనం చేసుకున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టార్గెట్ చేసుకుని రాజస్థాన్ నుంచి తెప్పిస్తున్న పప్పిస్ట్రాను యాదగిరి పల్లి చౌరస్తా వద్ద తనిఖీలు చేసి పోలీసులు సీజ్ చేశారు. మత్తు పదార్థాలను హైదరాబాద్ తరలిస్తున్న నిందితులు రాకేష్ బిష్ణోయ్, కరణ్ సింగ్ లను అరెస్ట్ చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే పలుమార్లు హెచ్చరించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, అందుకోసం ఎవరిమీద అయినా సరే ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
స్వయంగా రంగంలోకి దిగిన రాచకొండ కమిషనర్
హైదరాబాద్ శివారు ప్రాంతాలలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. అనుమానంగా కనిపిస్తున్న వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శివార్ల నుంచి నగరంలోకి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీల చేస్తున్నారు. మరోవైపు రాచకొండ పోలీసులు నగర శివార్లలోని ఫామ్ హౌస్ లు, రిసార్టులలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమతులు లేకుండా ఎవరైనా ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీలలో డ్రగ్స్ దొరికితే పబ్‌ల లైసెన్సులు రద్దుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేళ ఆంక్షలు, ఫ్లైఓవర్‌లు క్లోజ్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి సాయంత్రం నుంచి జనవరి ఒకటి ఉదయం ఐదారు గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్డులో మల్టీ లెవర్ ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ అండర్ పాస్, నాగోల్ ఫ్లై ఓవర్, బైరామల్ గూడ ఎక్స్ రోడ్, కామినేని ఫ్లై ఓవర్, చింతలకుంట అండర్ పాస్ లోని ఫస్ట్, సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్లపై టూ వీలర్, ప్యాసింజర్ వెహికిల్స్ కు అనుమతి ఉండదని రాచకొండ పోలీసులు ప్రకటించారు. వీటికి అనుగుణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు.