Eating Dragon Fruit For A Whole Day : రోజంతా ఏమి తినకుండా డ్రాగన్ ఫ్రూట్ తింటే ఏమవుతుందో తెలుసా? ఆ సమస్య మాత్రం తగ్గుతుందట
Dragon Fruit Diet : రోజంతా మీరు వేటి జోలికి వెళ్లకుండా కేవలం డ్రాగన్ ఫ్రూట్ తింటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఫ్రూట్‌ని రోజంతా తింటే కలిగే లాభాలు, నష్టాలు ఇవే.

Dragon Fruit Benefits : రోజుకో డ్రాగన్ ఫ్రూట్ తినాలంటేనే డబ్బుల్లేవు. కానీ రోజంతా డ్రాగన్ ఫ్రూట్స్ తింటూ గడపాలట అనుకోకండి. ఎందుకంటే దీని ధర కాస్త ఎక్కువే. అలా కాదు మీరు దానిపై డబ్బులు వెచ్చించగలరు అనుకుంటే రోజుకో డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. కానీ ఎప్పుడైనా కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకుని రోజంతా డ్రాగన్ ఫ్రూట్స్ తింటే ఏమవుతుందో చూడాలనుకుంటే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
డ్రాగన్ ఫ్రూట్‌లోని పోషకాలివే..
డ్రాగన్ ఫ్రూట్ పోషకాలతో నిండి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. దీనిలో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి2, విటమిన్ బి3 ఉంటాయి. పొటాషియం, మాంగనీస్, ఐరన్ దీనిలో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండి డ్రాగన్ ఆరోగ్యానికి, స్కిన్‌కి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. బీటాకెరోటిన్, లైకోపిన్, ఫైబర్, ప్రోటీన్‌తో నిండిన ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని రోజూ తీసుకుంటే ఎంతో మంచిది. మరి దీనిని రోజంతా తీసుకుంటే ఏమి జరుగుతుందో ఇప్పుడు చూసేద్దాం.
రోజంతా డ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే లాభాలివే
డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి, బి2, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనిలోని విటమిన్ సి.. ఆరోగ్య సమస్యలను దూరం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. రోజంతా డ్రాగన్ ఫ్రూట్ తింటే మలబద్ధకం సమస్య తగ్గి ఫ్రీ మోషన్ అవుతుందని చెప్తున్నారు. మలబద్ధకంతో ఇబ్బంది పడేవారు రోజుకోసారి లేదా రెండురోజులకోసారి దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట.
రోజంతా డ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే నష్టాలివే..
డ్రాగన్ ఫ్రూట్లో సహజమైన చక్కెరలు అధికంగా ఉంటాయి. కాబట్టి షుగర్ ఉన్నవారికి ఇది అంత మంచిది కాదు. దీనిలోని అధిక ఫైబర్, చక్కెర కంటెంట్ కారణంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తం పలుచబడే అవకాశం ఉంది.
ఇతర ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడేవారు దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడమే మంచిది. దద్దుర్లు, దురద, వాపు వంటి అలెర్జీలు రావొచ్చు. అలాగే రోజంతా డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడవచ్చు. ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు, ఖనిజాలుఎక్కువగా శరీరానికి అంది ఇబ్బంది ఏర్పడవచ్చు.
రోజుకు ఎంత తీసుకోవచ్చంటే..
డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు పొందాలనుకుంటే.. నెగిటివ్ ఇంపాక్ట్‌ని తగ్గించుకోవడానికి మీ డైట్లో దీనిని చేర్చుకోవచ్చు. రోజుకు ఒ కప్పు లేదా 200 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్‌ని తీసుకోవచ్చు. మీ సలాడ్స్‌తో కలిపి లేదా నేరుగా కూడా దీనిని మీ డైట్లో తీసుకోవచ్చు. ఏదైనా ఎక్కువ మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

