Healthy Fruits : ఈ ఫ్రూట్స్ రెగ్యూలర్‌గా నెలరోజులు తింటే ఏమవుతుందో తెలుసా? బరువు తగ్గేందుకు అది బెస్ట్
Fruits Business : కొన్ని ఫ్రూట్స్ రోజూ తింటే ఆరోగ్యంపరంగా కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏ ఫ్రూట్ తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Healthy Diet with Fruits : పండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే కొన్ని ఫ్రూట్స్‌ని రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయట. అలాంటి వాటిలో కొన్ని ఫ్రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందా. వాటిని నెలరోజులు రెగ్యూలర్‌గా తింటే ఏమవుతుంది? ఆరోగ్యం విషయంలో జరిగే మార్పులు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్ బాగా ధర ఎక్కువగా ఉండే పండ్లలో ఇది ప్రధానంగా ఉంటుంది. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే దీనికి ఇంత ధర ఉండడంలో తప్పులేదు అనిపిస్తుంది. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్స్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పోషకాలతో నిండిన డ్రాగన్ ఫ్రూట్‌ని నెలరోజులు కచ్చితంగా తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే హెల్తీ స్కిన్ మీ సొంతమవుతుంది. ఇమ్యూనిటీ పెరిగి.. సీజనల్ వ్యాధులు దూరమవుతాయి.
జామకాయ
సీజన్‌తో సంబంధం లేకుండా రెగ్యూలర్‌గా దొరికే పండ్లలో జామపండ్లు ఒకటి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటి గింజల్లో ఒమేగా 3, ఒమేగా 6 వంటి ఆమ్లాలు ఉంటాయి. పీచుపదార్థాలు కూడా ఎక్కువే. మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. జామకాయలను రోజూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. జీర్ణశక్తి మెరుగవుతుంది. మలబద్ధకం దూరమవుతుంది. టేస్టీగా ఉండే ఈ ఫ్రూట్‌ని రెగ్యూలర్‌గా డైట్లో లేదా స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.
బీట్ రూట్
బీట్ రూట్‌ని కొందరు రెగ్యూలర్‌గా తీసుకుంటారు. జ్యూస్‌లు, సలాడ్స్, కర్రీ రూపంలో దీనిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు అందుతాయో తెలుసా? వీటిలో ఐరన్, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ దీనిని తింటే స్టామినా పెరుగుతుంది. శరీరంలోని మలినాలను బయటకి పంపి డిటాక్స్ చేస్తుంది. రక్తహీనత తగ్గుతుంది. బీపీని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లివర్ హెల్త్‌కి ఇది చాలా మంచిది.
ద్రాక్షలు
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి పూర్తి ఆరోగ్యానికి మంచిది. బ్రెయిన్ హెల్త్‌కి మంచిది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండెను ఆరోగ్యంగా చేసి స్ట్రోక్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. కొలెస్ట్రాల్‌ని అదుపు చేయడంలో, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తాయి. వీటిలోని విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.
కేవలం ఇవే కాకుండా రెగ్యూలర్‌గా మీరు ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. బొప్పాయి, అవకాడో, పుచ్చకాయ వంటివాటిని కూడా రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. అయితే వేటిని మీ డైట్లో చేర్చుకోవాలనుకున్నా కచ్చితంగా వైద్యులు లేదా నిపుణుల సలహాలు తీసుకోవాలి. అప్పుడే హెల్తీగా ఉంటూ ఆరోగ్య ప్రయోజనాలు పొందుతూ హెల్త్‌ని కాపాడుకోవచ్చు.
Also Read : ప్రపంచ ఆహార దినోత్సవం 2024.. ఈ ఏడాది థీమ్, చరిత్ర, లక్ష్యాలు ఇవే