IPL 2025 DC Team Analysis: ఈసారైనా టైటిల్ కొట్టేనా..? 17 ఏళ్లుగా కప్ కోసం ఎదురు చూపులు.. కొత్త కెప్టెన్, కొత్త జట్టుతో..
అక్షర్ ను కెప్టెన్ గా డీసీ నియమించింది. అంతగా అనుభవం లేని అక్షర్ ఈ సీజన్ లో ఎలా నెట్టుకొస్తాడో చూడాలి. అతనికి డిప్యూటీగా బాగా అనుభవం ఉన్న సౌతాఫ్రికా మాజీ ఫాఫ్ డుప్లెసిస్ ఉండటం ప్లస్ పాయింట్.

DC In IPL 2025 Season: ఐపీఎల్ లో ప్రారంభంనుంచి ఆడుతున్న కొన్ని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ఆరంభంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ గా బరిలోకి దిగి, మధ్యలో క్యాపిటల్స్ గా పేరు మార్చుకుంది. పేరు మారినా, జట్టు రాత మారలేదు. 17 ఏళ్ల ప్రస్థానంలో ఢిల్లీ కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్స్ కు చేరింది. 2020 సీజన్లో ఫైన్లలో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఇక ఈ ఏడాది మరింత చాలెంజింగ్ గా ఆ జట్టుకు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. విధ్వంసక ప్లేయర్ రిషభ్ పంత్, అటు కెప్టెన్సీ నుంచి , ఇటు జట్టు నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను కెప్టెన్ గా నియమించింది. అయితే అంతగా అనుభవం లేని అక్షర్ ఈ సీజన్ లో ఎలా నెట్టుకొస్తాడో చూడాలి. అయితే అతనికి డిప్యూటీగా బాగా అనుభవం ఉన్న సౌతాఫ్రికా మాజీ ఫాఫ్ డుప్లెసిస్ ఉండటం ప్లస్ పాయింట్. అయితే ఈ సీజన్లో ఢిల్లీ బలాలు ఏంటో చూద్దాం..
పటిష్టమైన టాపార్డర్..
అనాదిగా ఢిల్లీ బ్యాటింగ్ కు పెట్టింది పేరు. ఆస్ట్రేలియన్ యువ ఓపెనర్ జాక్ ఫ్రేసర్ మెక్ గర్క్, కేఎల్ రాహుల్, డుప్లెసిస్ లతో బలంగా ఉంది. కన్సిస్టెన్సీకి వీరు చిరునామాగా ఉంటారు. అయితే అనుభవం లేని మిడిలార్డర్ ఢిల్లీకి బలహీనతగా మారింది. అభిషేక్ పోరెల్, అశుతోష్ శర్మలతోపాటు అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ తదితరులు ఉన్నా, తొలి ఇద్దరు అంతగా ప్రూవ్ చేసుకోలేదు. అయితే వారి టాలెంట్ పై ఎలాంటి సందేహం లేదు. అక్షర్, స్టబ్స్ బ్యాటింగ్ లోనూ అదరగొడుతుండటం ప్లస్ పాయింట్. వెటరన్ కరుణ్ నాయర్ కూడా అందుబాటులో ఉన్నాడు. డొమెస్టిక్ లో అద్భుత ఫామ్ ను చాటుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక విధ్వంసక ప్లేయర్ హేరీ బ్రూక్ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలగడం మైనస్ పాయింట్. అతని స్థానంలో మరెవరినైనా ఎంపిక చేస్తుందో చూడాలి.
బలమైన బౌలింగ్ లైనప్..
ఈ సీజన్ లో ఢిల్లీ తమ బౌలింగ్ లైనప్ ను బలంగా మార్చింది. ఆసీస్ స్పీడ్ స్టర్ మిషెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్, నటరాజన్, మోహిత్ శర్మలతో చాలా పటిష్టంగా ఉంది. బౌలింగ్ లో అందరూ నిరూపించుకున్నావారే. మొత్తం మీద ఈ జట్టును అక్షర్ ఈ సీజన్ లో ఎలా నడిపిస్తాడో చూడాలి. ఇక అందరూ అనుకున్నట్లుగా కెప్టెన్ గా కాకపోవడం రాహుల్ మైనస్ పాయింట్. అది తన ఆటపై ప్రభావం చూపించకుండా తను జాగ్రత్త పడాలి. అలాగే తన స్వార్థం కోసం కాకుండా, జట్టు ప్రయోజనల కోసం ఆడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
డీసీ ప్లేయింగ్ లెవన్ (అంచనా): జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మిషెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ, టి. నటరాజన్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

