Keerthy Suresh : 'మహానటి' తర్వాత గ్యాప్ - అసలు రీజన్ ఏంటో చెప్పిన కీర్తి సురేష్
Keerthy Suresh Movies : 'మహానటి' తర్వాత తనకు చాలా రోజులు ఛాన్సెస్ రాలేదని హీరోయిన్ కీర్తి సురేష్ తెలిపారు. ఆ సినిమాలో సావిత్రి పాత్రపై ట్రోలింగ్స్‌పై మరోసారి స్పందించారు.

Keerthy Suresh About Her Career : 'మహానటి' మూవీతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్నారు హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి నటనకు నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. అయితే, మహానటిలో తాను నటించినందుకు చాలా ట్రోలింగ్స్ ఎదుర్కొన్నట్లు గతంలోనే చెప్పిన ఆమె... తాజాగా ఈ అంశంపై మరోసారి స్పందించారు.
6 నెలల గ్యాప్
'మహానటి' తర్వాత తనకు సినిమా ఛాన్సులు రాలేదని చెప్పారు కీర్తి సురేష్. 'మహానటి తర్వాత నాకు 6 నెలల సినిమా ఛాన్సులు రాలేదు. ఇది ఎవరూ నమ్మరు. దీంతో ఇంట్లోనే ఖాళీగా ఉండిపోయాను. కనీసం ఇండస్ట్రీ నుంచి ఎవరూ కథ చెప్పడానికి కూడా రాలేదు. అయితే, మహానటి సినిమా చేసి నేను తప్పు చేశానని అనుకోలేదు.
ఆ సినిమాలో సావిత్రి పాత్రలో తాను నటించినందుకు నేను ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటాను. కొత్త అవకాశాలు రాలేదని ఎలాంటి నిరాశ చెందలేదు. మహానటి తర్వాత నా కోసం ఓ ప్రత్యేకమైన పాత్రలను క్రియేట్ చేసే పనిలో దర్శక నిర్మాతలు పడ్డారేమో అనిపించింది. ప్రజలు నన్ను అలాంటి పాత్రల్లో చూసేందుకు టైం ఉందని సానుకూలంగా తీసుకున్నా. ఆ గ్యాప్‌ను నేను మేకోవర్ కోసం ఉపయోగించుకున్నాను.' అని చెప్పారు.
'మహానటి' సావిత్రి బయోపిక్‌లో కీర్తి సురేష్ తన నటనతో అందరి మనసులు దోచుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. 66వ భారత జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటి, ఉత్తమ తెలుగు సినిమా, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ వంటి విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.
Also Read : స్మాల్ మూవీ... బిగ్ సక్సెస్ - 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీకి 3 రోజుల్లోనే ఊహించని కలెక్షన్స్
ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళ, తెలుగు మూవీస్‌తో బిజీగా మారారు. ఆమె లాస్ట్ మూవీ 'ఉప్పు కప్పురంబు' డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది. తాజాగా లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ 'రివాల్వర్ రీటా'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీకి జేకే చంద్రు దర్శకత్వం వహించగా... కీర్తి లేడీ డాన్‌గా కనిపించనున్నారు. రాధికా శరత్ కుమార్, రెడిన్ కింగ్స్ లీ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 28న తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది.
దీంతో పాటే విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్ధన' మూవీలో హీరోయిన్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అలాగే, నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ఎక్స్‌క్లూజివ్ మూవీ 'అక్క' కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో 'తొట్టం' మూవీ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైైరెక్టర్ మిస్కిన్ థ్రిల్లర్ సినిమాలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది.






















