India vs South Africa Second Test Match Highlights | భారీ స్కోరుకు సఫారీల ఆలౌట్ | ABP Desam
గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసింది. సెనురన్ ముత్తుసామి సెంచరీతో చెలరేగాడు. మార్కో జాన్సెన్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్‌లతో 489 పరుగులకు ఆలౌట్ అయింది.
టీమ్ ఇండియా మూడో సెషన్‌లో 246 పరుగులకు దక్షిణాఫ్రికా 6 వికెట్లు పడగొట్టింది. కానీ రెండో రోజు సెనురన్ ముత్తుస్వామి, కైల్ వెరెయిన్ భాగస్వామ్యంతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వెరెయిన్ 45 పరుగులు చేయగా, ముత్తుస్వామి ఆ తర్వాత మార్కో జాన్సెన్‌తో కలిసి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి స్కోరు బోర్డును నడిపించాడు. చూస్తుండగానే దక్షిణాఫ్రికా జట్టు మొదట 450 స్కోరును కూడా దాటింది. చివరి 4 వికెట్లకు దక్షిణాఫ్రికా 243 పరుగులు జోడించడం విశేషం.
భారత్ తరఫున బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తొలి ఇన్నింగ్సులో 100 కంటే ఎక్కువ పరుగులు సమర్పించారు. కుల్దీప్ 4, బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. టీమ్ ఇండియా ఈ మ్యాచ్ గెలవాలంటే ఎదో ఒక అద్భుతం జరగాల్సిందే. రెండు టీమ్స్ పోటా పోటీగా ఆడితే మ్యాచ్ ఫలితం లేకుండా ముగుస్తుంది. అదే జరిగితే ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 1-0తో కైవసం చేసుకుంది.





















