Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
Dharmendra Death : బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన పార్థీవ దేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.

Bollywood Actor Dharmendra Final Ritual Completed : బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబైలోని విల్లే పార్లీ శ్మశాన వాటికలో ఆయన పార్థీవ దేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. తొలుత ఆయన భౌతిక కాయాన్ని పవన్ హన్స్ శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఆయన్ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు.
బాలీవుడ్ యాాక్టర్స్ అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ సహా ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు ధర్మేంద్ర పార్థీవ దేహానికి కడసారి నివాళి అర్పించారు. అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందంటూ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ధర్మేంద్ర... చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు.
Also Read : బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఫ్యామిలీకి వచ్చేది ఎంతంటే?





















