Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Hyderabad: కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే హైదరాబాద్ యువత ఖచ్చితంగా సీపీ సజ్జనార్ హెచ్చరికలు వినాల్సిందే. గుర్తు పెట్టుకోవాల్సిందే. లేకపోతే తరవాత బాధపడి ప్రయోజనం ఉండదు.

New Year Celebrations: హైదరాబాద్ పోలీసులు ముఖ్యంగా సీపీ సజ్జనార్ కొత్త ఏడాది వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం, ఇతరులను ఇబ్బందిపెట్టడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. సాధారణంగా సీరియస్ హెచ్చరికలు చేసే పోలీసులు, ఈసారి కాస్త వ్యంగ్యాన్ని ఘాటు విమర్శలను జోడించి మద్యం మత్తులో వాహనాలు నడిపేవారికి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులతో వాగ్వాదానికి దిగి, లేనిపోని చట్టాలను వల్లించే మేధావుల ను లక్ష్యంగా చేసుకుని సజ్జనార్ మరింత హెచ్చరించారు.
మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడినప్పుడు, పోలీసులకు చట్టాలు నేర్పే ప్రయత్నం చేసే వారిపై సజ్జనార్ సెటైర్లు వేశారు. భారతీయ చట్టాల్లో సెక్షన్ 123, 567 వంటివి లేవు.. ఒకవేళ మీరు అవే ఉన్నాయని వాదిస్తే, మీరు స్టాండప్ కామెడీకో లేదా ఫిక్షన్ రైటింగ్‌కో పనికొస్తారు అంటూ ఎద్దేవా చేశారు. ఊహాజనిత చట్టాలతో పోలీసులను బురిడీ కొట్టించాలనుకుంటే చివరకు నవ్వుల పాలు కావాల్సిందేనని హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి, పోలీసులపై చిందులు తొక్కే వారి పరిస్థితి ఎలా ఉంటుందో పోలీసులు కళ్లకు కట్టారు. అప్పటికప్పుడు వారు చేసే రచ్చ అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల, మరుసటి రోజు అది వారి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక మ్యూజియం లా నిలిచిపోతుందని హెచ్చరించారు. ఆ సమయంలో చూపించే అతి తెలివి వల్ల జీవితాంతం పరువు పోవడం ఖాయమని హెచ్చరించారు.
మద్యం మత్తులో వాహనం నడిపితే కలిగే పరిణామాలను వివరించారు. ప్రియమైన వాహనం డిటెన్షన్ సెంటర్ లో బూట్ క్యాంప్ శిక్షణ పొందాల్సి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే, నిందితులు కోర్టుకు వెళ్ళినప్పుడు వారి అసలు లాయర్లు నిజమైన సెక్షన్లు చదివి వినిపిస్తుంటే, అప్పుడు వీరి 'లీగల్ మేధస్సు' కుప్పకూలిపోతుందని, ఆ సమయంలో వారి అహం దారుణంగా దెబ్బతింటుందని స్పష్టం చేశారు.
NEWSFLASH ⚠️
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 31, 2025
Dear Sirs and Madams,
Indian law has not discovered Sections 123 and 567. So if you’re trying to school our personnel on these imaginary rules while wobbling behind the wheel at 2 AM… congratulations! Your destiny is clear: stand-up comedy, fiction writing, or… https://t.co/ZpNHRzDA5G pic.twitter.com/HRr4kxRMB9
హైదరాబాద్ పోలీసులు అంటే 'డ్రంక్ అండ్ డ్రైవ్' విషయంలో సున్నా సహనం (Zero Tolerance) పాటిస్తారని సజ్జనార్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా మద్యం సేవించడం తప్పు కాదని, కానీ తాగి స్టీరింగ్ పట్టుకుని రోడ్లపైకి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ బోలే తో - జీరో టాలరెన్స్ అనే ట్యాగ్‌తో వినూత్నంగా ఈ అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం చేశారు.





















