Bangladesh Cricket Huge Loss | టీ20 వరల్డ్ కప్ ఆడనన్నుందుకు BCB కి భారీ నష్టం | ABP Desam
బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ నుంచి తప్పించింది కేకేఆర్ జట్టు. ఇక్కడ మొదలైన వివాదం...అటు తిరిగి ఇటు తిరిగి బంగ్లా క్రికెట్ బోర్డుకు భారీ నష్టాన్నే తెచ్చిపెట్టేలా ఉంది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవటంతో ఐసీసీ ఆగ్రహానికి బీసీబీ గురైంది. ముందుగా వరల్డ్ కప్ ఆడితే వచ్చే నాలుగున్నర కోట్ల రూపాయలను బంగ్లా క్రికెట్ బోర్డ్ కోల్పోనుంది. అంతే కాదు వరల్డ్ కప్ టోర్నీ స్పాన్సర్ల నుంచి బంగ్లా క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయం కూడా ఆగిపోనుంది. అక్కడితోనూ ఆగదు..ఐసీసీ నుంచి బంగ్లా దేశ్ క్రికెట్ బోర్డుకు వచ్చే వార్షిక బడ్జెట్ లోనూ భారీ కోత వేయనుంది ఐసీసీ. ఏటా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుంచి బంగ్లా క్రికెట్ బోర్డు కు 247కోట్ల రూపాయల ఆదాయం అందుతోంది. ఇది బంగ్లా క్రికెట్ బోర్డ్ సముపార్జించే ఆదాయంలో 60శాతం. సో ఇప్పుడు ఈ డబ్బులు ఆగిపోతే బంగ్లా క్రికెట్ బోర్డు భారీ సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. అన్నింటికంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ కు కాసుల పంట భారత్ తో జరిగే మ్యాచ్ లు. భారత్ తో సిరీస్ ఆడినప్పుడు కోట్లాది రూపాయల ఆదాయం బంగ్లాదేశ్ అందుకునేది. ఇప్పుడు భారత్ పైనే ఆరోపణలు చేసింది కాబట్టే పాకిస్తాన్ తరహాలోనే ఇకపై బీసీసీఐ బంగ్లాదేశ్ క్రికెట్ తో బోర్డ్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడే అవకాశం లేదు. ఇవన్నీ కలిపితే బంగ్లాక్రికెట్ బోర్డ్ భవిష్యత్తులో ఎదుర్కోబోయే సంక్షోభం ఊహించటానికి కూడా అంతుచిక్కటం లేదు.





















