అన్వేషించండి

Affordable Bikes: 10 వేల డౌన్ పేమెంట్‌తో TVS Radeon కొనేయండి.. తక్కువ ధరతో అధిక మైలేజీ బైక్

Affordable Bikes in India | టీవీఎస్ రేడియన్ బైక్‌ను లోన్ ద్వారా కొనుగోలు చేసి, ప్రతినెలా ఈఎంఐ చెల్లించే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో ఎక్కువ మైలేజీ అందించే బైకులలో TVS Radeon ఒకటి.

Budget Bikes In India | భారత మార్కెట్లో ద్విచక్ర వాహనాలు (Two Wheelers)కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అధికంగా కార్లు, బైకులు విక్రయాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటి. TVS మోటార్స్ బైక్‌లు, స్కూటర్లు దేశవ్యాప్తంగా విక్రయాలలో దుమ్మురేపుతున్నాయి. కంపెనీ నిలకడ కొనసాగిస్తోంది. టీవీఎస్ కంపెనీ Radeon 110 మోటార్‌సైకిల్ దాని స్టైలిష్ డిజైన్, అధిక మైలేజీతో కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటోంది.  TVS Radeon ఆల్-బ్లాక్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర ₹55,400 గా ఉంది.

మీరు ఇంటి నుండి ఉద్యోగం లేదా మీ రోజువారీ పనికి వెళ్లేందుకు జర్నీ చేయడానికి అధిక మైలేజ్ బైక్ కోసం చూస్తున్నారా, అయితే TVS Radeon 110 ఒక మంచి ఛాయిస్ కావచ్చు. TVS ఈ బైక్‌ను 4 వేర్వేరు వేరియంట్లలో విక్రయిస్తుంది. TVS Radeon ఆల్-బ్లాక్ ఎడిషన్ కోసం మీరు ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి, ప్రతినెలా EMI ఎంత చెల్లించవచ్చో ఫైనాన్స్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

బైక్ ఆన్-రోడ్ ధర ఎంత?

దేశ రాజధాని ఢిల్లీలో TVS Radeon 110 ఆల్-బ్లాక్ ఎడిషన్ ఆన్-రోడ్ ధర దాదాపు ₹67,000గా ఉంది. ఇందులో ₹3,000 RTO ఛార్జీలు, ₹6,000 బీమా మొత్తం ఉంటుంది. అదనంగా మీరు 10,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ₹55,000 బైక్ లోన్ తీసుకోవాలి. మీరు 0.5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల పాటు నెలకు ₹1,800 EMI చెల్లిస్తే సరిపోతుంది. ఒకేసారి మొత్తం చెల్లించలేనివారు ఈ విధంగా లోన్ తీసుకుని ఫైనాన్స్ ప్లాన్ చేసుకోవాలి.

TVS Radeon 109.7 cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 7,350 rpm వద్ద 8.08 bhp శక్తిని, 4,500 rpm వద్ద 8.7 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేశారు. భారత మార్కెట్లో TVS Radeon ప్రధానంగా హీరో స్ప్లెండర్, బజాజ్ CT 100 (Bajaj CT 100), హోండా CD 110 డ్రీమ్, బజాజ్ ప్లాటినా (Bajaj Platina) వంటి బైక్‌లతో పోటీపడుతుంది.

TVS బైక్ ఎంత మైలేజీ ఇస్తుంది?

ఈ TVS రేడియన్ ​​బైక్ 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. దీని ARAI క్లెయిమ్ చేసిన మైలేజ్ 73 kmplగా ఉంది. ఈ బైక్ ఒకసారి ఫుల్ ట్యాంక్‌ చేపిస్తే దాదాపు 700 కిలోమీటర్లు మీరు సులభంగా ప్రయాణించగలదు. రేడియన్ 110 అన్ని వేరియంట్లలో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉపయోగించారు. ఈ బైక్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget