Hero Splendor Plus లేదా Honda Shine 100 DX - ఏది మంచి కమ్యూటర్ బైక్? ధర, ఫీచర్లు
Hero Splendor Plus, హోండా షైన్ 100cc బైక్ సెగ్మెంట్లో ఫేమస్ బైకులు. 1 లక్ష లోపు బడ్జెట్లో మంచి బైక్ కోసం చూసేవారు ఈ రెండు బైక్స్ వివరాలు తెలుసుకోవాలి.

Hero Splendor Plus vs Honda Shine 100 DX | భారతదేశంలో టూవీలర్స్ కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. కంపెనీలు పోటీ పడి మరీ తమ బైక్స్, స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. భారతదేశంలో Hero Splendor Plus చాలా సంవత్సరాలుగా ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ గా ఉంది. అయితే Honda కంపెనీ ఇటీవల Shine 100 DX ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం ద్వారా తమ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది.
హోండా Shine 100 DX నేరుగా Splendor Plus తో పోటీ పడుతుంది. ఈ 2 బైకుల ధర విషయానికి వస్తే, Hero Splendor Plus ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 75,000 నుండి ప్రారంభమవుతుంది. అయితే Honda Shine 100 DX దాదాపు 71,746 రూపాయల ఎక్స్ షోరూం ధరకు లభిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే ధర విషయంలో Honda కొంచెం చౌకగా ఉంటుంది.
డిజైన్ లో ఎంత తేడా ఉంది?
Hero Splendor Plus డిజైన్ చాలా కాలం నుంచి దాదాపు ఒకేలా ఉంది. హీరో కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త రంగులు, గ్రాఫిక్స్ ని జోడిస్తుంది. దాంతో ఇది పాతదైనా తాజాగా కనిపించేలా చేస్తుంది. ఇందులో క్రోమ్ ఫినిష్ తో 3D Hero లోగో, Splendor Plus బ్యాడ్జ్ ఉన్నాయి. ఈ బైక్ 5 వేర్వేరు రంగులలో కస్టమర్లకు అందుబాటులో ఉంది.
అదే సమయంలో, Honda Shine 100 DX లుక్ కొంచెం మోడ్రన్‌గా కనిపిస్తుంది. ఇందులో క్రోమ్ టచ్ తో పెద్ద హెడ్ ల్యాంప్, ప్లాస్టిక్ బాడీ ప్యానెల్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. ఇవి సింగిల్-పీస్ సీటుతో మంచి బ్యాలెన్స్ చేస్తాయి. ఈ హోండా షైన్ బైక్ నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.
ఫీచర్లలో ఏ బైక్ ముందుంటుంది..
Hero Splendor Plus లో స్టాండర్డ్ గా అనలాగ్ మీటర్ ఇచ్చారు. అయితే, ఎక్కువ టెక్-ఫీచర్లు కావాలనుకునే కస్టమర్ల కోసం, Splendor Plus XTEC వేరియంట్ అందుబాటులో ఉంది. ఇందులో డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మైలేజ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Honda Shine 100 DX లో ప్రారంభం నుంచే పూర్తిగా డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. ఇది రియల్-టైమ్ మైలేజ్, రేంజ్, టైమ్ వంటి సమాచారాన్ని చూపుతుంది.
2 బైక్స్ ఇంజిన్, పనితీరు
Hero Splendor Plus లో 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 7.9 hp శక్తిని, 8.05 Nm టార్క్ ని అందిస్తుంది. అదే సమయంలో Honda Shine 100 DX లో 98.98cc ఇంజిన్ ఉంది. ఈ బైక్ 7 hp శక్తిని, 8.04 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు బైక్ లలో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. మైలేజ్ పై రెండు కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.






















